Advertisement
Google Ads BL

రెట్టించిన ఉత్సాహంతో రెండోసారి.!


ఏదైనా సినిమా హిట్ అవగానే దానికి సీక్వెల్ చెయ్యాలి అనుకోవడం ఈ మధ్యన సర్వసాధారణం అయ్యిపోయింది. అందులోనూ రెండు మూడు ప్లాప్స్ పలకరించే సరికి ఇంతకుముందు మనకు హిట్ ఇచ్చిన సినిమా ఫ్లో లో వెళదామనిపిస్తుంది. దాన్నే ఫాలో అవుదామనిపిస్తుంది. హిట్ సినిమాలకు సీక్వెల్స్ చేసే ఫ్రాంచైజీలు బాలీవుడ్ లో అయితే బోలెడున్నాయి. తెలుగులో మాత్రం ఇప్పుడిప్పుడే ఆ సీక్వెల్స్ ఊపందుకుంటున్నాయి అని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సీక్వెల్స్ ని పరిశీలిస్తే.. వెంకటేష్ దృశ్యం 2, నిన్న ఓపెనింగ్ జరుపుకున్న నాని - అడివి శేష్ హిట్ 2, అలాగే మంచు విష్ణు - శ్రీని వైట్ల ఢీ 2, అడివి శేష్ గూఢచారి 2 , అలాగే పూరి జగన్నాధ్ తమ్ముడి సాయి రామ్ శంకర్ ల బంపరాఫర్ 2  కూడా మొదలయ్యింది.

Advertisement
CJ Advs

తేజ డైరెక్షన్ లో చిత్రం కి సీక్వెల్ గ చిత్రం 2, అనిల్ రావిపూడి ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3, నిఖిల్ కార్తికేయ సీక్వెల్ గ చందు మొండేటి డైరెక్షన్ లో కార్తికేయ 2... అయితే ఇప్పుడు ఈ సీక్వెల్స్ ని పక్కనబెడితే.. పూరి జగన్నాధ్ - మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ 2 టేకాఫ్ కాబోతుంది అనేది ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇక తారక్ - వినాయక్ కాంబినేషన్ లో అదుర్స్ 2 అనేది ఎప్పటినుండో నలుగుతుంది. ఇలా హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ అంటూ అటు హీరోలు, ఇటు దర్శకులు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Second time with double excitement.!:

Hit Movie Sequels shuru
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs