Advertisement
Google Ads BL

పవన్ ఇమేజ్ కోసమే టైటిల్ మార్పు


వేణు శ్రీరామ్ దర్శకుడిగా పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ రిలీజ్ కి సిద్దమవుతుంది. ప్రస్తుతం వకీల్ సాబ్ ప్రమోషన్స్లో మూవీ టీం బిజీగా వుంది. ఇప్పటికే థమన్, వేణు శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రిల ఇంటర్వూస్, వకీల్ సాబ్ మ్యూజిక్ ఫెస్ట్ అబ్బో వకీల్ సాబ్ హంగామా మాములుగా లేదు. అయితే బాలీవుడ్ నుండి పింక్ రీమేక్ అనుకున్నప్పుడు ఈ సినిమాకి టైటిల్ గా వేరే టైటిల్ అనుకున్నామంటూ కొత్త విషయాన్ని బయట పెట్టారు దర్శకుడు వేణు శ్రీరామ్. 

Advertisement
CJ Advs

ముందుగా వకీల్ సాబ్ టైటిల్ గా మగువ టైటిల్ అనుకున్నామని.. కథకు తగ్గట్టుగా మగువ అని పెడితే బావుంటుంది అనుకున్నారట. అలాగే ఆ మగువా మగువా సాంగ్ కూడా.. చాలా పెద్ద హిట్ అవడంతో.. ఆ టైటిల్ అనుకున్నామని.. కానీ చివరికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగినట్లుగా వకీల్ సాబ్ అంటూ మార్చేశామంటూ టైటిల్ విషయం బయట పెట్టారు. వకీల్ సాబ్ సినిమాలో పవన్ రోల్ పేరు సత్యదేవ్ అని కూడా చెప్పారు. మరి ముందునుండి అనుకున్నట్టుగా పింక్ రీమేక్ వకీల్ సాబ్ అనేది మహిళా ప్రాధాన్యత ఉన్న మూవీగా కాకుండా పవన్ సినిమాగానే ప్రాజెక్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ టైటిల్ విషయంలోనూ పవన్ క్రేజ్ ని, ఇమేజ్ ని బట్టే మార్చారు అంటే.. ఈ సినిమాలో పవన్ హీరోయిజం ఓ రేంజ్ లో ఉండబోతున్నట్టే.

Vakeel saab title he is not the first choice:

Vakeel saab Movie update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs