Advertisement
Google Ads BL

పుష్ప విలన్ ని ఇంట్రడ్యూస్ చేసేసారు


సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ - రష్మిక కాంబోలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న పుష్ప మూవీ షూటింగ్ మొదలై నెలలు గడుస్తున్నా ఈ సినిమాలో అల్లు అర్జున్ అలియాస్ పుష్ప రాజ్ పాత్రని ఢీ కొట్టబోయే విలన్ పేరు మాత్రం రివీల్ చెయ్యలేదు. పుష్ప మూవీ ఎనౌన్స్ చేసినప్పుడే తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పుష్ప విలన్ గా సెట్ చేసుకున్న సుకుమార్ కి విజయ్ సేతుపతి హ్యాండ్ ఇవ్వడంతో అప్పటినుండి పుష్ప విలన్ పై అనేక పేర్లు ప్రచారంలోకొచ్చాయి. పాన్ ఇండియా మూవీ అందుకే ఆ లెవల్ విలన్ అవసరం.. కాబట్టి సుకుమార్ ఎవరిని ఎంపిక చేస్తాడో అని ఎదురు చూస్తున్నారు. అందులో ముఖ్యంగా మంచు మనోజ్, అలాగే తమిళ హీరో ఆర్య పేర్లు బాగా వినిపించాయి.

Advertisement
CJ Advs

అంతేకాదు.. బాలీవుడ్ హీరోల్లో ఎవరినైనా పుష్ప విలన్ గా సుకుమార్ పట్టుకొస్తాడేమో అనే ఆసక్తితో అల్లు అర్జున్ అభిమానులు ఉన్నారు. అయితే నేటితో పుష్ప విలన్ ఎవరు అనే క్యూరియాసిటీకి కి తెర దించారు. మేకర్స్. పుష్ప సినిమాలో పాన్ ఇండియా లెవల్లో పుష్ప రాజ్ ని ఢీ కొట్టబోయే నటుడు ఎవరు అనేది రివీల్ చేసింది యూనిట్. ఇంతవరకు ఎవరు గెస్ చెయ్యని పేరుని సుకుమార్ పుష్ప విలన్ గా చూజ్ చేసుకున్నాడు. మలయాళంలో హీరోగానూ, విలక్షణ పాత్రలకి పెట్టింది పేరైన ఫాహద్ ఫాసిల్ అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రని ఢీ కొట్టబోయే పవర్ ఫుల్ విలన్ గా ఓ వీడియో బైట్ తో రివీల్ చేసేసారు. మరి ఫాహద్ ఫాసిల్ ఇప్పటికే కమల్ హాసన్ - లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న విక్రమ్ సినిమాలోనూ విలన్ కేరెక్టర్ చేస్తున్నాడనే ప్రచారం ఉంది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కి విలన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఫాహద్. 

He is Pushpa's Villain!:

Pushpa: Fahadh Faasil roped in to play fierce villain in Allu Arjun starrer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs