ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవడం, అందులో కొన్ని హిట్ అయినా.. కొన్ని ప్లాప్ అవుతుంటాయి. ఇక లాక్ డౌన్ ముగిసి థియేటర్స్ ఓపెన్ అయ్యాక ప్రతి వారం కాకపోయినా.. నెలలో ఓ ఫ్రైడే మాత్రం హిట్ సినిమాలను అందించింది ప్రేక్షకులకి. అలా జనవరిలో రవితేజ క్రాక్ సూపర్ హిట్ అవ్వగా, ఫిబ్రవరిలో ఉప్పెన కలెక్షన్స్ అల్లాడించాయి. ఇక తర్వాత మహా శివరాత్రి రోజున విడుదలైన మూడు సినిమాల్లో జాతి రత్నాలు సూపర్ హిట్ అవ్వగా.. నిన్న శుక్రవారం మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ముందు నుండి కాస్త డల్ గా కనిపించిన ఆ మూడు సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అసలే డల్గా మొదలైన బాక్సాఫీసు.. ఆయా సినిమాలకొచ్చిన టాక్ తో మరింత నీరస పడిపోయాయి.
చావు కబురు చల్లగా, శశి, మోసగాళ్లు.. ముందు అనుకున్నట్టుగా శశి - మోసం - చావు అన్నట్టుగానే ఉన్నాయి. ఈమూడు సినిమాల్లో ఏ ఒక్క సినిమా అయినా.. ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పిస్తాయనుకుంటే.. మూడు మూడే అన్నట్టు కనిపించాయి. కార్తికేయ చావు కబురు చలాగ్గా సినిమా.. సెకండ్ హాఫ్ వీక్ అవడంతో.. సో సో టాక్ రాగా, మంచు విష్ణు మోసగాళ్లు.. ప్రేక్షకులని మోసం చేసేసింది. ఇక ఆది సాయి కుమార్ శశి.. సినిమా తీసిన దర్శకుడిలో ఎలాంటి కసి కనబడలేదు. అయితే మోసగాళ్లు, శశి తో పోలిస్తే కార్తికేయ చావు కబురు చల్లగా సినిమా కి కాస్త ఓపెనింగ్స్ వచ్చాయి.
కాజల్ లాంటి టాప్ హీరోయిన్, గ్లామర్ హీరోయిన్ ని పెట్టుకుని కూడా మంచు విష్ణు ఏం చెయ్యలేకపోయాడు. ఇక అది సాయి కుమార్ ఒకే ఒక లోకం నువ్వే పాటతో శశి మీద ఆశలు రాజేసినా.. ప్రేక్షకులను మాత్రం థియేటర్స్ దారి పట్టించలేకపోయాడు. విడుదలకు ముందే మూడు సినిమాల బుకింగ్స్ చాలా డల్ గా ఉంటే.. విడుదలయ్యాక బుకింగ్స్ మరింత పడిపోయాయి. అసలే డల్ ఫ్రైడే అనుకుంటే.. డల్ ఫ్రైడే కాదు.. ఇది నిల్ ఫ్రైడే అయింది.