Advertisement
Google Ads BL

రిలీజ్ లకే కాదు.. ప్రీ రిలీజ్ లకి పోటీనే


ఒకే రోజు మూడు సినిమాలు విడుదలవడం అనేది గత మూడు నాలుగు వారాలుగా చూస్తూనే ఉన్నాం. గత వారం జాతి రత్నాలు, శ్రీకారం, గాలి సంపత్ లు విడుదలైతే.. ఈ వారం శశి, చావు కబురు చల్లగా, మోసగాళ్లు రిలీజ్ అయ్యాయి. వచ్చే వారం మూడు సినిమాల జాతర మొదలైంది. వచ్చే వారం అంటే శుక్రవారం రానా - నితిన్ పోటీ పడుతుంటే.. ఆ నెక్స్ట్ డే అంటే శనివారం 27 న కీరవాణి కొడుకు సింహ బరిలోకి దూకుతున్నాడు. నితిన్ రంగ్ దే, రానా అరణ్య మూవీస్ తో పాటుగా ఒక్క రోజు లేట్ గా సింహ నటించిన తెల్లవారితే గురువారం సినిమా విడుదల కాబోతుంది. అయితే మూడు సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్ జోరుగానే సాగుతున్నాయి. ఇప్పుడు మూడు సినిమాలు బాక్సాఫీసు దగ్గర పోటీ పడడమే కాదు.. ఇటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ విషయంలో పోటీకి దిగాయి.

Advertisement
CJ Advs

అంటే రేపు ఆదివారం ఒక్క రోజే రానా అరణ్య ఇటు నితిన్ రంగ్ దే, మరోపక్క తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేసుకున్నారు. రానా అరణ్య ఈవెంట్ ని పార్క్ హయాత్ లో మధ్యాహ్నం 1.30 నిమిషాలకు జరగబోతుంది. వెంకటేష్, క్రిష్, శేఖర్ కమ్ముల చీఫ్ గెస్ట్ లుగా అరణ్య ఈవెంట్ జరగనుంది. ఇక నితిన్ రంగ్ దే ఈవెంట్ ఆదివారం అంటే రేపు సాయంత్రం శిల్ప కళావేదికలో గ్రాండ్ గా ప్లాన్ చేసారు. మరోపక్క జెఆర్సీ లో RRR హీరో ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి చీఫ్ గెస్ట్ లుగా సింహ తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ వేడుక జరగబోతుంది. మరి బాక్సాఫీసు దగ్గర సినిమాలు పోటీ పడడమే కాదు.. ఇప్పుడు ఈవెంట్స్ విషయంలో హీరోలు పోటీ పడడం గమమత్తుగా ఉంది.

Not just for release, competition for pre-release:

Rang de, Aranya, Thellavarithe Guruvaram pre release events in Sunday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs