Advertisement
Google Ads BL

అచ్చిరాని ఐటెం సాంగ్స్


పెళ్లయిన తర్వాత అనసూయలా ఎవ్వరూ ఇంతలా పాపులర్ అయ్యుండరు. జబర్దస్త్ అందాలతో.. గ్లామర్ షో చెయ్యడమే కాదు.. వెండితెర మీద కూడా ఆకర్షణీయమైన పాత్రలతో అదరగొట్టేస్తుంది. సినిమాల్లో కీ రోల్స్ ప్లే చేస్తూ స్పెషల్ సాంగ్స్ అవకాశాలు పట్టేస్తున్న అనసూయకి అన్ని చోట్ల సక్సెస్ దక్కింది. అటు యాంకర్ గాను, ఇటు వెండితెర మీద నటిగాను. కానీ అనసూయ కి స్పెషల్ సాంగ్స్ అచ్చిరావడం లేదనిపిస్తుంది. అందులో అనసూయ తప్పు కానీ, ఆమె పెట్టిన ఎఫర్ట్స్ కానీ తక్కువేమి కాదు.. అనసూయ మాస్ స్టెప్స్ కి ఫాన్స్ ఫిదానే. కానీ అనసూయ స్పెషల్ సాంగ్స్ చేసిన సినిమాలే హిట్ అవడం లేదు.

Advertisement
CJ Advs

గతంలో సాయి ధరం తేజ్ విన్నర్ లో సుయ సుయ అంటూ స్పెషల్ సాంగ్ చేసిన అనసూయ కి ఆ సినిమా ఫలితం షాకిచ్చింది. అనసూయ సాంగ్ కి మంచి మార్కులు పడినా.. సినిమా ఫలితం తేడా కొట్టడంతో ఆ సాంగ్ అంతగా పాపులర్ అవ్వలేదు. ఇక రీసెంట్ గా చావు కబురు చల్లగా మూవీలో అనసూయ స్పెషల్ సాంగ్ చేసింది. అనసూయ మాస్ స్టెప్స్, సాంగ్ అన్ని సూపర్.. కానీ సినిమా ఫలితమే మళ్ళీ తేడా కొట్టింది. క్రిటిక్స్ నుండి పూర్ రేటింగ్స్, ప్రేక్షకుల స్పందన సో సో గా ఉండడంతో చావు కబురు చల్లగా రొటీన్ లిస్ట్ లో చేరిపోయింది. సినిమాలో అనసూయ సాంగ్ గురించి ప్రేక్షకులు, క్రిటిక్స్ స్పెషల్ గా మట్లాడుకున్నా అనసూయ కి ఏం ఉపయోగం ఉంది.. సినిమా ఫలితం తేడా కొట్టాక. మరి అనసూయకి ఆ లెక్కన స్పెషల్ సాంగ్స్ అచ్చిరావనే ఫిక్స్ అయిపోవచ్చేమో.

Anasuya Special Song in Chavu Kamburu Challanga:

Anasuya Special Song in Chavu Kamburu Challanga
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs