Advertisement
Google Ads BL

మెహ్రీన్ ప్రేమ ముచ్చట్లు


ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎఫ్ 3 లో అవకాశం దక్కించుకున్న హీరోయిన్ మెహ్రీన్ కౌర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. భవ్య బిష్ణోయ్ తో రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని ఆమె ఫాన్స్ కి షాకిచ్చింది. ఎఫ్ 3 షూటింగ్ లో బిజీగా ఉన్న మెహ్రీన్ కౌర్ సడన్ గా పెళ్లి అనేసరికి అందరూ షాకయ్యారు. అయితే పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న ఇంటికి కోడలిగా వెళ్ళబోతున్న మెహ్రీన్ కౌర్ భవ్య బిష్ణోయ్ తో పరిచయం, ప్రేమ గురించిన మేటర్ బయట పెట్టింది. భవ్య బిష్ణోయ్ తో కేవలం 10 నెలల పరిచయమే అయినప్పటికీ.. దానితో తనకి జన్మజన్మల అనుబంధం ఉన్నట్లుగా చెబుతుంది మెహ్రీన్. గత ఏడాది లాక్ డౌన్ లోనే భవ్య తో తనకి పరిచయం ఏర్పడింది అని.. లాక్ డౌన్ వలన కలవలేకపోయినా.. ఫోన్స్, మెసేజెస్ చేసుకుంటూ గడిపేశామని, ఇద్దరి అభిప్రాయాలను, ఇష్టాలను పంచుకున్నాం అంటుంది.

Advertisement
CJ Advs

మాకు పరిచయమైన ఆరో రోజునే భవ్య బిష్ణోయ్ పెళ్లి ప్రపోజల్ తెచ్చారు. భవ్య బిష్ణోయ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం అండమాన్ వెళ్ళినప్పుడు.. అక్కడ స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు విల్ యు మ్యారి మీ అనే కార్డు తో నన్ను సర్ప్రైజ్ చేసాడు. నేను వెంటనే ఓకె చెప్పేసాను అంటూ మెహ్రీన్ భవ్య తో ప్రేమ, పరిచయం గురించి అందరితో పంచుకుంది. ఇక నిశ్చితార్థపు విషయాలన్నీ తాము ఇద్దరూ దగ్గరుండి ప్లాన్ చేసుకున్నట్లుగా చెబుతుంది మెహ్రీన్. అతిధులకు ఇన్విటేషన్స్ దగ్గరనుండి, ఫుడ్ వరకు, నిశ్చితార్థపు డెకరేషన్ నుండి ఇలా ప్రతి విషయంలో తాము ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకున్నామని, ఎందుకంటే నిశ్చితార్ధం అనేది తమ జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని రోజుగా ఉండబోతుంది కనుక అంటుంది.

ఇక పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదని, వింటర్ సీజన్ లో తాను భవ్య బిష్ణోయ్ తో పెళ్లి పీటలెక్కే అవకాశం ఉన్నట్లుగా చెబుతుంది మెహ్రీన్ కౌర్. అయితే తమది పక్కా డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఉండబోతుంది అని.. ఇప్పటినుండే పెళ్లి విషయంలో తాను ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టుగా చెబుతుంది మెహ్రీన్.

Mehreen Pirzada gets engaged to beau Bhavya Bishnoi:

Mehreen Pirzada gets engaged to Bhavya Bishnoi in Jaipur
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs