నిజంగానే మహేష్ బాబు ఫాన్స్ కి మస్త్ మజా ఇచ్చే న్యూస్. ఎందుకు అంటే ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం పోకిరి సినిమాలో తన యాటిట్యూడ్ చూపించి ఆపై ఖలేజాలో తన కామెడీ టైమింగ్ చూపించి.. ఆ తర్వాత దూకుడులో తన ఆల్ రౌండ్ పెరఫార్మెన్స్ చూపించి స్క్రీన్స్ ని షేక్ చేసిన మహేష్.. ఆ తర్వాత మొత్తం సెటిల్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యిపోయాడు. భరత్ అనే నేను, మహర్షి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఇలా వరస సినిమాల్లో సెటిల్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యిపోవడం వలన.. మహేష్ లోని ఎనేర్జి మిస్ అయ్యారు ఫాన్స్.
మొన్నామధ్యన వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో కొంతవరకు మాస్ గా ట్రై చేసినా, కొంచెం లౌడ్ గా పెర్ఫర్మ్ చేసే ప్రయత్నాలు జరిగినా.. ఆ ఎనర్జీ మహేష్ ఫాన్స్ కి సరిపోలేదు. మహేష్ లోని కామెడీ టైమింగ్, అతని ఎనేర్జి, ఆ యాటిట్యూడ్ ఇంకా కావాలని ఉంది అందరికి. సర్కారు వారి పాటతో ఈసారి మహేష్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టెయ్యబోతున్నాడు దర్శకుడు పరశురామ్. చాలా రోజుల తర్వాత అండర్ ప్లే అనేది పక్కనబెట్టి.. కంప్లీట్ గా ఎక్సట్రీమ్ గా పెర్ఫర్మ్ చెయ్యబోతున్నాడు మహేష్. ఇప్పటివరకు వచ్చిన రష్ అంతా చూసి హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తున్నారట సర్కారు వారి పాట యూనిట్. నిజంగా మరి మహేష్ ఫాన్స్ కి మజా ఇచ్చే న్యూస్ కదా. సర్కారు వారి పాట మాములుగా మార్మోగేలా లేదు. ప్రతి ధ్వనించేలానే ఉంది.