Advertisement
Google Ads BL

కలర్ ఫుల్ గా రంగ్ దే


నితిన్ - కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన రంగ్ దే ట్రైలర్ ని రిలీజ్ చేసింది టీం. నితిన్ క్లాసీ లుక్స్, నితిన్ పెరఫార్మెన్స్, కీర్తి సురేష్ లుక్స్,  డైలాగ్స్, కామెడీ, ఎమోషన్స్ అన్ని రంగ్ దే ని కలర్ ఫుల్ గా చూపిస్తున్నాయి. చిన్నప్పుడే గర్ల్ ఫ్రెండ్ ని పంపించు దేవుడా అనుకున్నాడో లేదో.. అలా ఆ కాలనీలోకి ఓ అమ్మాయి దిగడం.. అప్పటినుండి అన్ని విషయాల్లో ఆ అమ్మాయి బుజ్జిగాణ్ణి తోకెయ్యడంతో.. ఆ అమ్మాయి మీద బాగా కసి పెంచుకుంటే.. చివరికి అదే అమ్మాయితో పెళ్లి జరిగితే ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుందో.. ఫన్నీగా చూపించాడు వెంకీ అట్లూరి. 

Advertisement
CJ Advs

నితిన్ కన్నా బాగా చదివి, మంచి ఉద్యోగం చేసే కీర్తి సురేష్ పదే పదే నితిన్ ఫ్యామిలీ ముందు నితిన్ ని చేతకానివాడిలా చూపెడుతూ.. కాల్చుకు తినేసే పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టిసింది. కీర్తి సురేష్ వలన అడుగడునా నలిగిపోయే అబ్బాయిగా నితిన్ పెరఫార్మెన్స్ సూపర్. అటు కామెడీ మాత్రమే కాదు.. ఎమోషనల్ గాను ట్రైలర్ ఆకట్టుకుంది. మనల్ని ప్రేమించేవాళ్ల విలువ.. వాళ్ళని వద్దనుకున్నప్పుడు తెలియదు, వాళ్ళు మనల్ని అక్కర్లేదు అనుకున్నప్పుడు తెలుస్తుంది అంటూ నితిన్ ఎమోషనల్ గా చెప్పే డైలాగ్ అన్ని బావున్నాయి. వెంకీ అట్లూరి డైరెక్షన్, నితిన్ పెరఫార్మెన్స్, కీర్తి సురేష్ నటన అన్ని సినిమాపై ఇంట్రెస్ట్ పెంచేస్తున్నాయి. వచ్చే శుక్రవారం నితిన్ రంగ్ దే థియేటర్స్ లోకి రాబోతుంది.

Click Here to: Rang De Trailer 

Rang De Movie Trailer Review:

Nithin Rang De Movie Trailer Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs