ఒకప్పుడు అతి పెద్దన్యూస్ ఛానల్ గా పేరు పొందిన TV9 ప్రస్తుతం దాని ఉనికిని చాటుకునే ప్రయత్యం లో వుంది. కేవలం ఈటివి న్యూస్ ఛానల్ మాత్రమే ఉన్న టైం లో రవిప్రకాష్ కొంతమంది పార్టనర్స్ తో కలిసి TV9 న్యూస్ ఛానల్ మొదలు పెట్టాడు. తర్వాత నెంబర్ వన్ ఛానల్ గా అన్ని భాషల్లోనూ తమ బ్రాంచ్ లు ఓపెన్ చేసిన TV9 కి Ntv ABN ఛానల్స్ పోటీకి వచ్చాయి. అయినా కూడా పార్టీలకి అతీతంగా ఉండే TV9 తర్వాత కాలంలో కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ముకాయడం మొదలు పెట్టింది. అలాగే రవిప్రకాష్ ని సీఈవో పదవి నుండి తప్పించాక TV9 క్రేజ్ మసకబారడం మొదలు పెట్టింది. పబ్లిసిటీ కి ప్రచారం సాధనంగా ఉన్న TV9 ఇప్పుడు తమ ఛానల్ ని పబ్లిసిటీ చేసుకోవడం కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.
ఏ ఒక్క విషయాన్నీ అంటే అది పనికొచ్చినా, పనికి రాకపోయినా.. ఛానల్ లో పదే పదే ప్రసారం చేస్తూ పబ్లిసిటీ చేస్తే టీవీ9 ఇప్పుడు తమ టీఆర్పీ పెంచుకోవడానికి పబ్లిసిటీకి తెర లేపింది. హైదరాబాద్ ట్రాఫిక్ అధికంగా ఉండే రోడ్స్ మధ్యలో TV9 పబ్లిసిటి హోర్డింగ్స్ పెట్టడం ఇప్పుడు అందరికి ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. అందుకే అనేది పబ్లిసిటీకే పబ్లిసిటీ అనేది.