Advertisement
Google Ads BL

పవన్ కోసం ఇంతటి భారీ ప్లానింగా.!


పవన్ కళ్యాణ్ - వేణు శ్రీరామ్ కాంబోలో రాబోతున్న వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న రిలీజ్ కి సిద్దమవుతుంది. అయితే వకీల్ సాబ్ ని భారీ గా ప్రమోట్ చేస్తూ.. సినిమాపై క్రేజ్ పెంచే ప్రయత్నాల్లో దిల్ రాజు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి కం బ్యాక్ అయిన దగ్గరనుండి దిల్ రాజు వకీల్ సాబ్ విషయంలోనూ, పవర్ స్టార్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. రేపు ఏప్రిల్ 3 న వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. ఈ ఈవెంట్ ని ఓ రేంజ్ లో అంటే.. దాదాపుగా రెండు కోట్లు ఖర్చు పెట్టడానికి దిల్ రాజు సిద్దపడినట్లుగా భోగట్టా. పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న ప్రాజెక్ట్, దాని ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అంతే గ్రాండ్ గా జరగాలని.. ఈ ఒక్క ఈవెంట్ తోనే వకీల్ సాబ్ పై ఎక్కడ లైన్ హైప్ వచ్చెయ్యాలి, తెచ్చెయ్యాలని పెద్ద రేంజ్ లో స్కెచ్ వేస్తున్నారు.

Advertisement
CJ Advs

విశేషం ఏమిటి అంటే వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావాల్సిన గెస్ట్ ల గురించి మరో నిర్మాత బోని కపూర్ తో మాట్లాడి.. బాలీవుడ్ లో పింక్ చేసిన అమితాబ్ ని దింపుదామనుకున్నాడు దిల్ రాజు. అయితే ప్రస్తుతం ఉన్న పెండమిక్ సిట్యువేషన్ లో ఈ ఈవెంట్ కి రావడానికి అమితాబ్ ఎలాంటి ఆసక్తి చూపలేదని తెలుస్తుంది. ఇక తమిళ్ లో పింక్ రీమేక్ చేసిన అజిత్ ని రంగంలోకి దింపుదామనుకున్నాడు. కానీ అజిత్ కూడా అంత సుముఖంగా లేడని సమాచారం. అయితే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, రాజమౌళి, చిరంజీవి, రామ్ చరణ్ ఇలాంటి సెటప్ తో ఈవెంట్ చెయ్యాలా? లేదంటే ఇంకా స్టార్స్ ని సెట్ చేసుకోవాలా? అనే డిస్కర్షన్స్ అయితే ప్రస్తుతానికి నడుస్తున్నాయి. 

This is a huge plan for Pawan!:

Vakeel Saab Pre Release, Biggest Event In India
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs