Advertisement
Google Ads BL

విరాట పర్వం: విప్లవ ప్రేమ కథ


వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా - సాయి పల్లవి కాంబోలో తెరకెక్కిన విరాట పర్వం టీజర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. విరాట పర్వంలో రానా విప్లవకారుడిగా, అభ్యుదయ వాదిగా కనిపిస్తుంటే.. సాయి పల్లవి ఆ అభ్యుదయ వాది కవిత్వానికి ముగ్దురాలై అతని ప్రేమలో పడే సాధారణ అమ్మాయిగా కనిపిస్తుంది. విప్లవకారులకు - పోలీస్ లకి మధ్యన నలిగిపోయే పాత్రలో సాయి పల్లవి కేరెక్టర్ కానీ, లుక్స్ కానీ, ఆమె నటన కానీ అన్ని అద్భుతం అనే చెప్పాలి. ఇక అభ్యుదయ వాదిగా, కవితలు, కవిత్వాలు, కథలు రాసె అరణ్య పాత్రలో రానా పర్ఫెక్ట్ గా సూటవుతున్నాడు.

Advertisement
CJ Advs

అరణ్య కవితలు చదివి అతనిపై అంతులేని ప్రేమతో ఇంటిని సైతం వదిలేసి అరణ్య కోసం వచ్చేసి.. అరణ్య ని కలవడానికి ఎంతగా ఇబ్బందులు పడిందో సాయి పల్లవి కేరెక్టర్ లో చూపిస్తున్నారు. ప్రియమణి జస్ట్ ఓ షాట్ లో కనిపించినా.. డీ గ్లామర్ లుక్ లో ఆకట్టుకునేలా ఉంది. అరణ్య - సాయి పల్లవి ప్రేమ కథలో కావాల్సినంత యాక్షన్, బుల్లెట్స్ చప్పుళ్ళు కనిపిస్తున్నాయి. ఇక విరాట పర్వంలో రానా పాత్రలో ప్రత్యేకత ఉన్నా.. సాయి పల్లవి రానా కేరెక్టర్ ని డామినేట్ చెయ్యడం మాత్రం పక్కాగా కనిపిస్తుంది.. ఈ టీజర్ లో. సాయి పల్లవి నేచురల్ లుక్స్, సాయి పల్లవి పెరఫార్మెన్స్ అన్ని స్పెషల్ గా కనిపిస్తున్నాయి.

Click Here For Virata Parvam Trailer

Virata Parvam Movie Teaser Launch by Megastar :

Virata Parvam Movie Teaser review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs