హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో సెలబ్రిటీస్ పట్టుబడడం కోర్టుకెళ్లడం, కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది కొత్తేమి కాదు. గతంలో రవితేజ తమ్ముళ్లు, టివి ఆర్టిస్ట్ లు, జబర్దస్త్ కమెడియన్స్ ఇలా చాలామందే డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. అయితే యాంకర్ ప్రదీప్ గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి కోర్టుకెళ్లి కౌన్సిలింగ్ కూడా తీసుకున్నాడు. ఎన్నో షోస్ చేస్తూ, ఎనో నీతులు చెప్పే ప్రదీప్ అప్పుడు నెటిజెన్స్ చేతిలో తెగ ట్రోల్ అయ్యాడు. కానీ అది గతం గతః అన్నట్టుగా ప్రదీప్ మళ్ళీ షోస్ తో బాగా ఫెమస్ అవడం.. ఆ తర్వాత ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కాస్తా మరుగున పడిపోవడం జరిగిపోయింది.
ఇక రీసెంట్ గా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ ఇలానే డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడి.. తాను ఏలిన యూట్యూబ్ లోనే మూడునాలుగు రోజుల పాటు ఆ కేసు విషయంలో ట్రెండ్ అయ్యాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రమే కాకుండా యాక్సిడెంట్ కూడా చేసి నవ్వులపాలయ్యాడు. ఏ యూట్యూబ్ లో అయితే తన షార్ట్ ఫిలిమ్స్ తో టాప్ లో ఉన్నాడో.. అదే యూట్యూబ్ లో తానొక న్యూస్ అయ్యాడు. ఇక షణ్ముఖ్ కెరీర్ అయ్యిపోయింది అనుకున్నారు. ఈ కేసు విషయంలో కొన్నాళ్లుగా బయటికి రాని షణ్ముఖ్ ఫెమ్ అయ్యిపోయింది, క్రేజ్ తగ్గిపోయింది అనుకున్నారు.
గత ఏడాదో సాఫ్ట్ వెర్ డెవెలపర్స్ వెబ్ సీరీస్ తో ట్రెండ్ అయిన షణ్ముఖ్ ఈ ఏడాది సూర్య వెబ్ సీరీస్ తో అదరగొట్టాడు. అయితే రెండు ఎపిసోడ్ అయ్యాక షణ్ముఖ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడంతో మూడో ఎపిసోడ్ కాస్త లేట్ గా యూట్యూబ్ లో రిలీజ్ అయ్యింది. అయితే యూట్యూబ్ లో రిలీజ్ అయిన షణ్ముఖ్ సూర్య వెబ్ సీరియస్ ఎపిసోడ్ పెట్టిన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ ట్రేండింగ్ లోకొచ్చేసింది. అంటే షణ్ముఖ్ క్రేజ్ ఏం డ్యామేజ్ కాలేదు.. షణ్ముఖ్ ఈజ్ బ్యాక్ అంటూ షణ్ముఖ్ ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అప్పట్లో ప్రదీప్ ఎలా అయ్యాడో.. ఇప్పడూ షణ్ముఖ్ అంతే.. అందులో ఎలాంటి తేడా లేదంటున్నారు ఫాన్స్.