Advertisement
Google Ads BL

ఏ హీరో గట్టెక్కుతాడో..


గత రెండు నెలలుగా ప్రతి వారం నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతున్నట్టుగానే ఈ వారం మూడు సినిమాలు రిలీజ్ కి సిద్ధమయ్యాయి. రేపు శుక్రవారం ముగ్గురు ప్లాప్ హీరోలు తమ అదృష్టాన్ని బాక్సాఫీసు దగ్గర పరిక్షించుకోబోతున్నారు. గత వారం మూడు సినిమాలు రిలీజ్ అవగా.. అందులో ఒకే ఒక్క సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ వారం ఏ హీరో గెలుస్తాడా అనే ఆసక్తితో ప్రేక్షకులు ఉన్నారు. ఎందుకంటే ముగ్గురు హీరోలు ప్లాప్ లతో ఇబ్బందులు పడుతున్న హీరోలే. కార్తికేయకు ఇంతకుముందు గుణ 369, 90mL, గ్యాంగ్ లీడర్ సినిమాలు ప్లాప్ ఐయ్యాయి . ఇక ఇప్పుడు చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Advertisement
CJ Advs

ఇక మంచు వారబ్బాయి మంచు విష్ణు కి వరస ప్లాప్ లు కోలుకోలేకుండా చేసాయి, హీరో గా భారీ గ్యాప్ తీసుకుని చేసిన మోసగాళ్లు పై చాలా నమ్మకమే పెట్టుకున్నాడు. ఈ సినిమా ని నిర్మించడానికి మంచు విష్ణు ఆస్తులు అన్ని పెట్టేసాడని ఆయనే చెబుతున్నాడు. మోసగాళ్లు కథ మీదున్న నమ్మకంతోనే ఆస్తులు అన్ని ఈ సినిమా బడ్జెట్ కి పెట్టేసానని చెబుతున్నాడు. మరి ఈ సినిమా హిట్ అనేది మంచి విష్ణు కి అవసరం. ఇక మరో హీరో ఆది సాయి కుమార్.. ఆది కూడా వరస ప్లాప్ లతో కెరీర్ లో స్ట్రగుల్ అవుతున్న హీరోనే. వరస ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న అది సాయి కుమార్ శశి పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

మరి కార్తికేయ చావు కబురు చల్లగా, ఆది సాయి కుమార్ శశి, మంచు విష్ణు మోసగాళ్లు.. ఈ సినిమాల్లో ఎవరి సినిమా హిట్ అవుతుందో? ఎవరు ప్లాప్స్ నుండి బయట పడతారో? ఏ సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుందో? చూద్దాం.

Which hero will win?:

This Friday release Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs