Advertisement
Google Ads BL

పూజ హెగ్డే సినిమాలో దీపిక ఐటెం సాంగ్


బాలీవుడ్ లో దీపికా పదుకునే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనేది తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా దీపికా కెరీర్ కి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు సరికదా.. ఇప్పటికి ఫామ్ లోనే ఉంది. దీపికా పదుకొనే ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. అలా టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్న దీపికా ఇప్పుడు మరో పాన్ ఇండియా హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తున్న మూవీలో ఐటెం సాంగ్ చేయనుంది. పూజ హెగ్డే తెలుగులో రాధేశ్యామ్ పాన్ ఇండియా తో పాటుగా అఖిల్ అక్కినేని తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఆచార్య సినిమాలు చేస్తుంది. ఈమధ్యన పూజ హెగ్డే బాలీవుడ్ మూవీస్ తోనూ బిజీ అయ్యింది.

Advertisement
CJ Advs

రోహిత్ శెట్టి - రణవీర్ సింగ్ కాంబోలో సర్కస్ మూవీ లో పూజ హెగ్డే నే హీరోయిన్. అయితే బాలీవుడ్ లో హాట్ అండ్ క్యూట్ కపుల్ గా పేరున్న రణ్వీర్ సింగ్ -  దీపికా స్క్రీన్ మీద కనిపిస్తే ఆ క్రేజే వేరు. రణవీర్ సింగ్ రీసెంట్ మూవీ 83 లోను దీపికా ఓ కీ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు రణవీర్ సింగ్ సర్కస్ మూవీలో దీపికా స్పెషల్ సాంగ్ చేసిందట. ఇప్పటికే ఆ సాంగ్ తాలూకూ చిత్రీకరణ కూడా పూర్తయ్యింది అని, రణ్వీర్ సింగ్ - దీపికల మాస్ స్టెప్స్ అభిమానులని అలరించడం ఖాయమట. మరి పూజ హెగ్డే సినిమాలో ఆ రకంగా దీపికా పదుకొనే ఐటెం సాంగ్ చేసిందన్నమాట.

Deepika Padukone Item song in Circus Movie:

Deepika Padukone Item song in Ranveer Singh - Pooja Hegde Circus Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs