Advertisement
Google Ads BL

మెగాస్టార్ రైట్ డెసిషన్


మెగాస్టార్ చిరు ప్రస్తుతం ఆచార్య షూటింగ్ నుండి కాస్త రిలీఫ్ అయ్యారు. మారేడుమిల్లు ఫారెస్ట్, ఖమ్మం ఇల్లేందు లలో ఆచార్య షెడ్యూల్స్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన చిరంజీవి.. మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ షూటింగ్ కోసం రెడీ కాబోతున్నారు. ఇక మోహన్ రాజా లూసిఫెర్ రీమేక్ స్క్రిప్ట్ రెడీ చెయ్యడమే కాదు చిరు నుండి ఓకె కూడా చేయించేసుకున్నాడట. తెలుగు నేటివిటీకి దగ్గరగా.. లూసిఫర్ రీమేక్ స్రిప్ట్ రెడీ అయ్యింది. అయితే ఈ సినిమాలో చిరు కి సిస్టర్ పాత్రలో నయనతార కనిపించబోతుంది. ఆమెకి భర్త గా నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ లో అరవింద్ స్వామిని తీసుకున్నది టీం. కాకపోతే ఈ సినిమాలో చిరు పాత్రకి ఓ హీరోయిన్ ని పెట్టబోతున్నారని అన్నారు.

Advertisement
CJ Advs

మలయాళ లూసిఫర్ లో మోహన్ లాల్ కి హీరోయిన్ లేదు, డ్యూయెట్స్ లేవు. అలాగే తీస్తే ఫాన్స్ కి రుచించకపోవచ్చు. అందుకే చిరు కేరెక్టర్ కి హీరోయిన్ ని పెట్టబోతున్నారు.. ఓ డ్యూయెట్ కూడా ప్లాన్ చేయబోతున్నారనే టాక్ నడిచింది. కానీ చిరు తన పాత్రకి హీరోయిన్ వద్దు.. మాతృకలో ఎలా ఉందో అలానే చేద్దాం.. ఈ విషయంలో ఒరిజినల్ నే ఫాలో అవుదామంటూ మోహన్ రాజాకి చెప్పడంతో.. మోహన్ రాజా కూడా చిరునే ఫాలో అయిపోయాడట. ఇక కథ మొత్తం చిరు చుట్టూనే తిరిగేలా.. చిరు కి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉండేలా మోహన్ రాజా స్క్రిప్ట్ రెడీ చేసాడట. ఇక ఈ సినిమా ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి పట్టాలెక్కబోతుందని సమాచారం.

Megastar Right Decision:

Lucifer remake regular shoot in April
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs