కోలీవుడ్ లో.. కమల్ హాసన్ హీరోగా,శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో అనౌన్సమెంట్ తో మొదలు కావల్సిన ఇండియా 2 ప్రాజెక్ట్.. దిల్ రాజు తప్పుకోవడంతో.. ఆఘమేఘాల మీద లైకా ప్రొడక్షన్స్ వారు ఇండియన్ 2 ప్రాజెక్ట్ ని వారు చేతుల్లోకి తీసుకున్నారు. శంకర్ - కమల్ కాంబోలో లైకా ప్రొడక్షన్స్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలైన ఇండియన్ 2 ప్రాజెక్ట్ ఇప్పుడు మూలనపడింది. ఇండియన్ 2 ఫస్ట్ షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసాక.. నెక్స్ట్ షెడ్యూల్ జరుగుతున్నా టైం లో సెట్స్ లో జరిగిన అగ్ని ప్రమాదం వలన డైరెక్టర్ శంకర్ అస్సిస్టెంట్స్ మరణించడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తర్వాత శంకర్ - లైకా వారు సోషల్ మీడియా వేదికగా లేఖల యుద్ధం చెయ్యడం, మొన్నామధ్యన మళ్ళీ ఇండియన్ 2 మొదలు కాబోతుంది అనే న్యూస్ కూడా నడిచింది.
అయితే రీసెంట్ గా శంకర్ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీ ప్రకటించడం, కమల్ కూడా భారతీయుడు 2ని వదిలేసి విక్రమ్ షూటింగ్ లో బిజీ అవడంతో.. ఇక ఇండియన్ 2 అటకెక్కినట్లే అన్నారు. కానీ ఎక్కడా క్లారిటీ లేదు. అయితే తాజాగా మోసగాళ్లు ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ఇండియన్ 2 హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇక ఇండియన్ 2 ఉండకపోవచ్చు. కొన్ని టెక్నీకల్ ఇష్యుస్ వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.. ఇక ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కూడా లేవంటూ చెప్పడంతో.. ఇప్పుడు ఇండియన్ 2 ప్రాజెక్ట్ పై అందరూ ఓ అంచనాకు వచ్చేసారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడే కాజల్ - కమల్ కాంబో సీన్స్ కూడా జరిగాయి. అలాంటిది కాజల్ ఇండియన్ 2 ఉండకపోవచ్చనే అనుమానం లేవనెత్తింది అంటే.. పూర్తిగా లైకా వారు ఇండియన్ 2 ని పక్కనబెట్టేసినట్లే కనబడుతుంది వ్యవహారం.