Advertisement
Google Ads BL

మరోసారి చిక్కుల్లో రియా చక్రవర్తి


సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు  రియా చక్రవర్తి మెడకి చుట్టుకుని అది కాస్త డ్రగ్స్ కేసుగా మారి..  రియా చక్రవర్తి  కొన్ని నెలల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ గా  రియా చక్రవర్తి ఎంతగా ఎంజాయ్ చేసి.. హైలెట్ అయ్యిందో. అంతగా జైల్లో కష్టాలు పడింది. డ్రగ్స్ కేసులో ఎన్సీబీ నుండి విచారణ ఎదుర్కుంటున్న రియా చక్రవర్తికి కోర్టు గతేడాది అక్టోబరు 7న లక్ష రూపాయల పూచీకత్తుపై బెయిలు మంజూరు చెయ్యడంతో ఆమె బెయిల్ పై విడుదలైంది. తర్వాత కొన్నాళ్ళు ఇంటిపట్టునే ఉన్న రియా చక్రవర్తి ఇప్పుడిప్పడే మళ్ళి జనజీవన స్రవంతి లోకి వస్తుంది.

Advertisement
CJ Advs

కోర్టు అనుమతి లేకుండా ముంబై ని విడిచి వెళ్లరాదంటూ కోర్టు రియా చక్రవర్తికి ఆంక్షలు విధించింది. అయితే ఇప్పుడు ఎన్సీబీ అధికారులు రియా చక్రవర్తి బెయిల్ ని రద్దు చెయ్యాలంటూ పిటిషన్ వెయ్యడంతో మరోమారు ఎన్సీబీ విచారణకి రియా సిద్దమవ్వడమే కాదు.. మళ్ళీ జైలు కి వెళ్లే అవకాశం లేకపోలేదు అంటున్నారు. బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్సీబీ అధికారులు రియా బెయిల్ విషయంలో సుప్రీం కోర్టుకి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రియా బెయిల్ రద్దు చెయ్యాలని.. మళ్ళీ తనని తమ కష్టడికి ఇవ్వాలంటూ వారు సుప్రీం కోర్టుని ఆశ్రయించడంతో రియా మరోసారి చిక్కుల్లో పడినట్లే అనిపిస్తుంది.

Emperor Rhea once again in trouble:

NCB moves Supreme Court against Rhea Chakraborty bail
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs