Advertisement
Google Ads BL

చరణ్ కి చమటలు పట్టించిన శంకర్


దిల్ రాజు బ్యానర్ లో ప్రస్టేజియస్ ప్రాజెక్ట్, 50 వ సినిమా, శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్, అందులోనూ భారీ బడ్జెట్ తో మొదలు కాబోతున్న పాన్ ఇండియా మూవీ. మరి ఆ సినిమా స్క్రిప్ట్ ఎలా ఉండబోతుంది, అది ఏ రేంజ్ లో శంకర్ తెరకెక్కించబోతున్నారు. ఇలా అనేక ప్రశ్నలు అటు చరణ్ ఫాన్స్ లోను, ఇటు శంకర్ అభిమానుల్లోనూ ఉన్నాయి. అయితే  రామ్ చరణ్ కి స్క్రిప్ట్ నేరేషన్ ఇచ్చినప్పుడు దర్శకుడు శంకర్.. ఈ సినిమా కోసం ఏమేం చెయ్యాల్సి ఉంటుందో.. ఎలా చెయ్యాల్సి ఉంటుందో చెప్పగానే నిజంగా చమట్లు పట్టాయట రామ్ చరణ్ కి.. అనేది ఆయన సన్నిహితుల ద్వారా మాకు తెలిసిన సమాచారం. 

Advertisement
CJ Advs

ఈ సినిమా కోసం రెండు వేరియేషన్స్ ఉన్న కేరెక్టర్స్ ని ట్రై చేయాలట. దాని కోసం సిద్దమవ్వబోతున్నాడు చరణ్. ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాల్లో చాలా ఫిట్ గా కనిపించే చరణ్.. అంతకు మించిన నెక్స్ట్ లెవెల్ లుక్ లో శంకర్ సినిమాలో చరణ్ కనిపించబోతున్నాడు. దర్శకుడు చరణ్ కి ఇచ్చిన టార్గెట్ కూడా అదే. అయితే శంకర్ కావాలని ఇచ్చిన టార్గెట్ కాదది.. ఆ కథ డిమాండ్ చేస్తున్న టార్గెట్. అయితే శంకర్ చెప్పిన స్క్రిప్ట్, అందులోని వేరియేషన్స్ వినగానే చరణ్ విపరీతంగా ఇంప్రెస్స్ అయ్యాడట. అయితే ఆ సినిమా కోసం చరణ్ దాదాపుగా వన్ ఇయర్ డేట్స్ కేటాయించబోతున్నాడట.

ఇప్పటివరకు చరణ్ ని బిగ్ స్క్రీన్ మీద మిస్ అయ్యి కొన్ని రోజులైంది. అయితే ఇదే ఏడాది వరసగా రెండు బిగ్ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఆచార్య అండ్ ఆర్.ఆర్.ఆర్ మూవీ తో ఇదే ఏడాది ఫాన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇక మళ్ళీ వన్ ఇయర్ గ్యాప్ తో శంకర్ సినిమాతో చరణ్ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తాడు.

Shankar made Charan sweat:

Director Shankar is collaborating with Ram Charan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs