మంచు విష్ణు గత కొన్నాళ్లుగా ప్లాప్ లతో ఇబ్బందులు పడుతున్నాడు. అసలు మంచు కాంపౌండ్ నుండి సినిమాలొచ్చి చాలా రోజులైంది. మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర తర్వాత లాంగ్ గ్యాప్ తో ఓటర్ సినిమా చేస్తే.. అనేక కాంట్రవర్సీలతో ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా ప్రేక్షకులకు తెలియకుండా పోయింది. ఇక మోసగాళ్లు అంటూ హాలీవుడ్ స్టాండర్స్ తో సినిమాని తెరకెక్కించారు. మంచు విష్ణు టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అక్కాతమ్ముళ్లుగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటించారు. రేపు శుక్రవారం విడుదల కాబోతున్న మోసగాళ్లు సినిమాకి మార్కెట్ లో అస్సలు బజ్ లేదు. ప్రేక్షకుల్లో కూసింత ఇంట్రెస్ట్ కూడా కనిపించడం లేదు.
అంటే మంచు విష్ణు క్రేజ్ తగ్గిందా? లేదంటే మోసగాళ్లు పబ్లిసిటీ సరిపోవడం లేదా? అసలు గ్లామర్ భామ కాజల్ ఉన్నా ప్రేక్షకుల నుండి ఈ సినిమాకి సరైన స్పంద రావడం లేదు. ఇక మంచు విష్ణు మరో నటుడు నవదీప్ తప్ప మోసగాళ్లు ప్రెస్ మీట్ లో మరో మొహం కనిపించడం లేదు. వైజాగ్ లో జరిగిన మోసగాళ్లు ప్రీమియర్ షో కానీ, హైదరాబాద్ లో రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో కానీ మంచు విష్ణు, నవదీప్ ఉన్నారు తప్ప మరొకరు లేరు. ఇక నేడు హైదరాబాద్ లో జరగబోయే మోసగాళ్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరు ముఖ్య అతిధిగా వస్తున్నారని చెప్పినా సోషల్ మీడియాలో కదలిక లేదు. మంచు విష్ణు మోసగాళ్లు అప్ డేట్ పెట్టినా సోషల్ మీడియాలో సరైన స్పందన కనిపించడం లేదు. మరి వచ్చే వారం గీత ఆర్ట్స్ బ్యానర్ నుండి రాబోతున్న చావు కబురు చల్లగా సినిమా ముందు ఇంటర్నేషనల్ స్టాండర్స్ తో వసున్న మోసగాళ్లు కి ఎలాంటి హైప్ క్రియేట్ అవడం లేదు. కాజల్ లాంటి భామ ఉన్నా మోసగాళ్ళలో కదలికే కనిపించడం లేదు.