మలయాళంలో మోహన్ లా హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఫిబ్రవరి 19 న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన దృశ్యం 2 విమర్శకుల నుండి ప్రశంశలు పొందింది. జీతూ జోసెఫ్ మేకింగ్ స్టయిల్, మోహన్ లాల్ నటనకు ప్రేక్షకులు ఫిదా.. దృశ్యం 2 బ్లాక్ బస్టర్ అవడంతో మోహన్ లాల్ దృశ్యం చిత్రాన్ని రీమేక్ చేసిన టాలీవుడ్ సీనియర్ హీరో వెంకీ వెంటనే దృశ్యం 2 మూవీ రీమక్స్ రైట్స్ కొనెయ్యడం.. ఆ సినిమాని తెలుగులో మొదలు పెట్టడం అన్ని చాలా ఫాస్ట్ గా జరిగిపోయాయి. అయితే దృశ్యం 2 రిలీజ్ అయ్యాక సెలబ్రిటీస్ ఆ సినిమాపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.
అయితే రీసెంట్ గా దృశ్యం 2 సినిమాకి సౌత్ టాప్ డైరెక్టర్ రాజమౌళి రివ్యూ ఇవ్వడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. రాజమౌళి దృశ్యం 2 మూవీ చూసి.. తాజాగా ఆ సినిమాకి రివ్యూ ఇవ్వడం అందరిని ఆకర్షించింది. అంతేకాకుండా దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ కి రాజమౌళి వాట్సాప్ సందేశం పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ వాట్స్ అప్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డియర్ జీతూ.. నేను డైరెక్టర్ రాజమౌళిని. మీరు డైరెక్ట్ చేసిన దృశ్యం 2 కొన్నాళ్ల క్రితమే చూసాను. ఆ సినిమా చూసాక నా ఆలోచనలన్నీ ఆ సినిమా చుట్టే తిరిగాయి. మళ్ళీ వెంటనే దృశ్యం మొదటి సినిమా చూసాను. దర్శకత్వం దగ్గరనుండి.. ఎడిటింగ్, యాక్టింగ్.. ఇలా ప్రతి టెక్నీకల్ విభాగం అన్ని అద్భుతం. వరల్డ్ వైడ్ స్థాయిలో ఉంది దృశ్యం కథ. దృశ్యం అనేది ఓ మాస్టర్ పీస్. అదే ప్రమాణాలతో దృశ్యం 2 తీసుకురావడం నిజంగా అభినందించదగ్గ విషయం. అది చాలా గొప్ప విషయం. మీనుండి మరికొన్ని మాస్టర్ పీస్ లు రావాలని కోరుకుంటున్నా అంటూ రాజమౌళి జీతూ జోసెఫ్ కి పంపిన వాట్స్ అప్ సందేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.