Advertisement
Google Ads BL

సమంత ధ్యాన ముద్ర


టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ గానే కాదు.. ఫిట్ నెస్ గర్ల్ గా సమంత.. జిమ్ లో పడే కష్టం చూస్తూనే ఉంటాం. పెళ్ళికి ముందు సమంత ఎలా ఉందో.. పెళ్లి తర్వాత అంతే ఫిట్ గాను, అంతే గ్లామర్ గాను ఉంది. ప్రస్తుతం శాకుంతలం పాన్ ఇండియా మూవీతో పాటుగా తమిళ్ మూవీ లో నటిస్తున్న అక్కినేని సమంతకి ఆధ్యాత్మికత కూడా ఎక్కువే. తన సినిమాల రిలీజ్ ల టైం లో తిరుపతి మెట్లెక్కి వేంకటేశ్వరుడిని దర్శించుకునే సమంత మహాశివరాత్రి రోజున జరిగిన జాగరణలో మంచు లక్ష్మి, శిల్ప రెడ్డి, రకుల్ ప్రీత్ లాంటి సెలబ్రిటీస్ తో కలిసి యోగ ధ్యానంలో మునిగిపోయింది.

Advertisement
CJ Advs

తాజాగా సమంత ధ్యానం చేస్తున్న ఫొటోస్ ని షేర్ చేస్తూ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలనుంటే, అలాగే మాసిక ఒత్తిళ్ళని అధిగమించాలంటే అందరూ ధ్యానం చెయ్యాలి.. అదే మీకు మీరిచ్చుకునే గొప్ప బహుమతి అంటూ యోగ ధ్యానంలో ఉన్న గొప్పదనాన్ని వివరిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, ఒత్తిళ్ళని అధిగమించాలన్నా ధ్యానం మాత్రమే మంచి మార్గమని, ప్రతి రోజూ యోగ, ధ్యానముద్ర చాలా ముఖ్యమని చెబుతుంది ఫిట్ నెస్ హీరోయిన్ సమంత. సమంత, మంచు లక్ష్మి, శిల్ప రెడ్డి ధ్యానం చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Fitness Freak Samantha turns Yoga Meditation lover:

Meditation is the only good way to keep the mind calm and overcome stress
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs