Advertisement
Google Ads BL

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో, నిర్మాత


గత ఏడాది అటు బాలీవుడ్ ని, ఇటు శాండిల్ వుడ్ ని పట్టి కుదిపేసింది డ్రగ్స్ కేసు. బాలీవుడ్ లో ప్రముఖ సెలబ్రిటీస్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణని ఎదుర్కొంటే.. కన్నడ పరిశ్రమలో ఏకంగా అరెస్ట్ లే జరిగాయి. నటి సంజన, రాగిణి ద్వివేదీలు కొన్ని నెలల పాటు ఈ డ్రగ్స్ వ్యవహారంలో జైలుకెళ్లారు. తాజాగా ఇప్పుడు టాలీవుడ్ ని తగులుకుంది. గతంలోనే పూరి జగన్నాధ్, ఛార్మి లాంటి వాళ్ళు ఈ డ్రగ్స్ కేసు విచారణలో పాల్గొంటే.. ఇప్పుడు నటుడు తనీష్ కి ఏకంగా కన్నడ పోలీస్ లు నోటీసు లు పంపడం చర్చనీయాంశం అయ్యింది. తనీష్ తో పాటుగా ఓ ప్ర‌ముఖ బిజినెస్‌మేన్‌, ఓ నిర్మాత కి కూడా ఈ నోటీసులు పంపినట్లుగా తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

కర్ణాటకలో బయటపడిన డ్రగ్స్ కేసులో విచారణ జరుపుతూండగా.. టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యారనే కోణంలో దర్యాప్తు చేపట్టగా.. టాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయని అందులో తనీష్ తో పాటుగా టాలీవుడ్ నిర్మాత ఒకరు ఉన్నారని తెలుస్తుంది. గతంలోనూ ఈ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా తనీష్ కూడా అధికారుల ఎదుట హాజరయ్యాడు. మళ్ళీ ఇప్పుడు సంజన, రాగిణి కేసుల విచారణలో తనీష్ పేరు బయటికి రావడం హాట్ టాపిక్ అయ్యింది. తనీష్ మాత్రమే కాకుండా ఇంకా టాలీవుడ్ లో కొంతమంది ప్రముఖులకు కూడా పోలీస్ లు నోటీసు లు జారీ చేసే అవకాశం లేకపోలేదని.. ఒకవేళ చిన్న క్లూ దొరికిన కర్ణాటక పోలీస్ లు వీళ్ళని వదలరని గుసగుసలు మొదలయ్యాయి.

Tollywood hero in drugs case, producer:

Police summons Telugu actor Tanish in drugs case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs