Advertisement
Google Ads BL

చిరు నాట్ హ్యాపీ విత్ ఆచార్య


కొరటాల శివ - చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా అటు రంపచోడవరం, మారేడుమిల్లు ఫారెస్ట్ లో ఇటు ఖమ్మం ఇల్లేందులోను చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆచార్య టీం హైదరాబాద్ కి చేరుకుంది. నిన్నటివరకు గ్యాప్ లేని ఆచార్య షూటింగ్ లో చిరంజీవి చురుగ్గా పాల్గొంటున్నారు. కొడుకు రామ్ చరణ్ తో కాంబో సీన్స్ కాబట్టి చిరు మరింత ఉత్సాహంతో ఆచార్య షూటింగ్ లో కనిపిస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగానే ఆచార్య గత షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి కూడా. అయితే షూటింగ్ అంతా బాగా జరుగుతుంది.. మే 13 న అనుకున్న డేట్ కి ఆచార్య థియేటర్స్ లోకి వచ్చేస్తుంది కూడా. ఆ రేంజ్ లో ఆచార్య షూటింగ్ ని కొరటాల చుట్టేస్తున్నారు.

Advertisement
CJ Advs

అటు కొడుకు రామ్ చరణ్ ఈ సినిమాలో నటించడం, కొరటాల స్పీడు అన్ని విషయాల్లోనూ చిరు హ్యాపీనే. కానీ ఆచార్యకి సంబందించిన ఒక విషయంలో చిరు హ్యాపీగా లేరట. అది ఆచార్య లెంత్ మేటర్. ఆచార్య లెంత్ విషయంలో చిరు కాస్త కంగారు పడుతున్నట్లుగా  తెలుస్తుంది. ఆ విషయమై కొరటాల శివ తో చిరు కి చిన్న ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది అనే టాక్ బయటికి వచ్చింది. ఇక్కడ మనం కొట్టి పడెయ్యలేనిది చిరంజీవి అనుభవం. మనం ఇంత తీసుకుంటూ వెళుతున్నాం.. ఇన్ని వర్కింగ్ డేస్ చేస్తున్నాము.. లెంత్ ఎక్కువైపోతోంది.. ఎడిటింగ్ లో ఎమన్నా ఇబ్బందులు తలెత్తుతాయేమో అంటూ కొరటాలతో చిరు మాట్లాడగా.. సర్ మీరు ఇది కంప్లీట్ చేసెయ్యండి. తర్వాత నేను కట్ చేసి చూపిస్తాను అని కొరటాల చెప్పడంతో చిరు కాస్త కూల్ అయినట్లుగా  తెలుస్తుంది.

Chiru not happy with Acharya:

Chiru seems to be a bit confused about Acharya Length
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs