Advertisement
Google Ads BL

పవన్ లుక్ పై తపనపడక్కర్లేదు


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి కం బ్యాక్ అయ్యాక ఆయన చేసిన పింక్ రీమేక్ వకీల్ సాబ్ లుక్ విషయంలో పవన్ ఫాన్స్ చాలా తపన చూపించారు. అయితే వకీల్ సాబ్ నుండి ఫస్ట్ లుక్ వదలకముందే.. ఆయన వకీల్ సాబ్ లుక్ సోషల్ మీడియాలో లీకై సన్సేషన్ అయ్యింది. వకీల్ సాబ్ కి సంబందించిన పోస్టర్స్, టీజర్ అండ్ సాంగ్స్ లో పవన్ లుక్ వకీల్ సాబ్ లో ఎలా ఉండబోతుందో దాదాపుగా రివీల్ అయ్యింది. ఇక క్రిష్ - పవన్ కాంబో హరి హర వీరమల్లు గా పవన్ లుక్ కూడా రివీల్ చేసింది చిత్ర బృందం. గజ దొంగ వీరమల్లుగా పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్ చూసి ఫాన్స్ కి పూనకలొచ్చేశాయి. హరి హర వీరమల్లు లుక్ రివీల్ కాకముందే క్రిష్ మూవీ సెట్స్ నుండి పవన్ లుక్ లీకైపోయింది.

Advertisement
CJ Advs

మరో పక్క మలయాళ ఏకే రీమేక్ లో పవన్ ఎలా ఉండబోతున్నారో డే వన్ నుండి ఆయన లుక్ బయట చక్కర్లు కొడుతోంది. బుల్లెట్ మీద పవన్ డ్రెస్సింగ్ స్టయిల్ , అలాగే ఏకే రీమేక్ లో పవన్ లుక్ ఆ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పుడే రివీల్ అయ్యింది. ఇప్పటివరకు పవన్ అదే లుక్, అదే డ్రెస్ లో కనిపిస్తున్నారు కానీ.. కొత్తగా ఎక్కడా వేరియేషన్ చూపించిన దాఖలాలు లేవు. అంటే ఏకే రీమేక్ లుక్ కోసం పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎక్కువగా తాపత్రయ పడక్కర్లేదు. ఆయన ఏకే రీమేక్ లుక్ ఎలా ఉంటుందో దాదాపుగా ఆయన షూటింగ్ కి వెళ్లిన ప్రతి రోజు సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. ప్రస్తుతం కూడా పవన్ బుల్లెట్ మీద కూర్చున్న ఏకే రీమేక్ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Pawan should not be tempted on the look:

Pawan Look in AK Remake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs