Advertisement
Google Ads BL

ఇంట్రెస్టింగ్ వైల్డ్ డాగ్


ఆన్ లైన్ రిలీజ్ అనుకున్న నాగార్జున వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2 న థియేటర్స్ లోకి రాబోతుంది. ప్రమోషన్స్ కారక్రమాల్లో భాగంగా వైల్డ్ డాగ్ ట్రైలర్ ని మెగాస్టార్ చిరు చేతుల మీదుగా రిలీజ్ చేసారు. మెగాస్టార్ వైల్డ్ డాగ్ ట్రైలర్ చూసిన తర్వాత నా ఫ్రెండ్ నాగ్ ఎప్పటిలాగే కూల్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు అన్నట్టుగానే  ఎన్ఐఏ ఏజెంట్ గా నాగార్జున అదరగొట్టేసాడు. విజయ్ వర్మ పాత్రలో వైల్డ్ డాగ్ అనిపించుకుంటూ శత్రువులని చీల్చి చెండాడే పాత్రలో నాగార్జున విశ్వరూపం చూపిస్తున్నారు. పవర్ ఫుల్ ఆఫీసర్ గా లుక్స్ పరంగా నాగ్ ఎనర్జీ లెవల్స్ అదుర్స్.

Advertisement
CJ Advs

నిజ సంఘట ఆధారంగా వైల్డ్ డాగ్ కథకి హైదరాబాద్ బాంబ్ దాడులకు కనెక్షన్ పెట్టిన దర్శకుడు సాల్మన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. హైద‌రాబాద్ లో జ‌రిగిన బాంబ్ దాడులకు కార‌ణ‌మైన పాకిస్థానీ టెర్ర‌రిస్టుల్ని ప‌ట్టుకోవ‌డ‌మే.. వైల్డ్ డాగ్ గా విజ‌య్ వ‌ర్మ అనే ఆఫీసర్ ప్రయత్నం. ఆ డ్యూటీలో అతని టీం అతనికి అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఏ టెర్రరిస్ట్ దొరికినా తీసుకెళ్లి జైల్లో పెట్టి మేపడం కాకుండా.. దొరికిన చోటే కాల్చి పడెయ్యడం విజయ్ వర్మ హాబీ.. మరి యాక్షన్ మోతాదు ఎక్కువగా ఉన్నా.. ఇలాంటి కథలకి యాక్షన్ పార్ట్ ముఖ్యం కాబట్టి అది అంతగా బోర్ కొట్టదనే అనిపిస్తుంది. మరి నాగార్జున యాక్షన్ మోడ్, సీరియస్ లుక్స్ చూస్తుంటే ఈ సినిమా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తుంది. 

Click Here to: Wild Dog Trailer

Nagarjuna Wild Dog: Intresting :

Nagarjuna Wild Dog Trailer Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs