Advertisement
Google Ads BL

ఆఫీషియల్: ఆదిపురుష్ ప్రభాస్ సీత ఫిక్స్


ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముంబైలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో మొదలు పెట్టిన విషయంలో తెలిసిందే. ఫిబ్రవరిలోనే పట్టాలెక్కాల్సిన ఆదిపురుష్ సినిమా.. ఆదిపురుష్ సెట్ లో సంభవించిన అగ్నిప్రమాదం వలన కాస్త లెట్ అయినా.. ప్రస్తుతం చిత్రీకరణకు సమాయత్తమవుతోంది టీం. టైటిల్ తోనే సన్సేషన్ క్రియేట్ చేసిన ఓం రౌత్ - ప్రభాస్.. తర్వాత వెంటనే విలన్ గా అంటే రావణ్ గా సైఫ్ అలీ ఖాన్ పేరు ప్రకటించారు. ఆ తర్వాత  సైఫ్ రావణ్ గురించి మాట్లాడిన మాటలకు ఆదిపురుష్ వివాదాలను కూడా ఎదుర్కొంది. 

Advertisement
CJ Advs

ఇకపోతే ఆదిపురుష్ సీత పై ఉన్న సస్పెన్స్ కి తెర దించారు ఆదిపురుష్ యూనిట్. ముందు నుండి ఆదిపురుష్ సీత పై రకరకాల పేర్లు ప్రచారంలోకొచ్చాయి. కియారా అద్వానీ పేరు దగ్గరనుండి కీర్తి సురేష్ పేరు వరకు ప్రభాస్ పక్కన సీత పాత్రకి వినిపించినా చివరికి కృతి సనన్ దగ్గర ఆ వార్తలు ఆగాయి. కృతి సనన్ పేరు తర్వాత మరో హీరోయిన్ పేరు అయితే సీత పాత్రకి వినిపించలేదు. ఫైనల్ గా ప్రభాస్ అండ్ ఆదిపురుష్ టీం సీత పాత్రకి కృతి సనన్ కే ఫైనల్ ఓటు వేశారు. అదే విషయాన్నీ ఈ రోజు ఉదయమే అధికారికంగా ఎనౌన్సమెంట్ ఇచ్చేసారు. 

అంతేకాకుండా గతంలో లక్షణ్ పాత్రకి వినిపించిన సన్నీ సింగ్ నే ప్రభాస్ తమ్ముడి గా లక్షణ్ కేరెక్టర్ కి ఫిక్స్ చేసి అటు హీరోయిన్ గా కృతి సనన్ పేరు ఇటు లక్షణ్ గా సన్నీ సింగ్ పేర్లు అనౌన్స్ చేసారు. ఇక రాముడిగా ప్రభాస్, సీత గా కృతి సనన్, లక్షణ్ గా సన్నీ సింగ్ పేర్లు తో పటు ఫోటో ని పోస్ట్ చేసారు. ప్రస్తుతం ప్రభాస్ , కృతి సనన్, సన్నీ సింగ్ కలిసి దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Prabhas With Sita And Lakshmana:

<h3 class="text-center">Prabhas Adipurush: Kriti Sanon And Sunny Singh</h3>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs