Advertisement
Google Ads BL

జాతి రత్నాల్లో స్పెషల్ రత్నాలు


నవనీన్ పోలిశెట్టి - ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ కాంబోలో అనుదీప్ దర్శకత్వంలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మాతగా తెరకెక్కిన జాతి రత్నాలు మహాశివరాత్రి స్పెషల్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రిలీజ్ కు ముందే మార్కెట్ పరంగా మంచి బజ్ తెచ్చుకున్న జాతిరత్నాలు స్పెషల్ పబ్లిసిటీ సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపించింది. మార్నింగ్ షోస్ నుండే జాతిరత్నాలు థియేటర్స్ హౌస్ ఫుల్ గా కళకళలాడాయి. మార్నింగ్ షో టాక్ తో జాతి రత్నాలు సినిమాపై యూత్ లో మరింత క్రేజ్ పెరిగిపోయింది. జాతి రత్నాలుగా నవీన్ పోలిశెట్టి, ప్రియా దర్శి, రాహుల్ రామకృష్ణలు సినిమాకి బ్యాక్ బోన్ గా నిలవడం, అనుదీప్ కామెడీ మేకింగ్ హైలెట్ గా నిలవడంతో సినిమాకి మంచి టాక్ స్ప్రెడ్ అయ్యింది. అటు మీడియా సపోర్ట్ కూడా జాతి రత్నాలకు పుష్కలంగా ఉండడం.. మంచి రివ్యూస్ పడడంతో జాతి రత్నాలు హిట్ లిస్ట్ లో చేరిపోయింది.

Advertisement
CJ Advs

ఇక జాతిరత్నాలు సినిమాలో స్పెషల్ రత్నాలు ఎవరంటే.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో గోల్డ్ ఫేస్ బాయ్స్ గా నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండలు నటించడంతో వాళ్ళు మంచి  ఫ్రెండ్స్ అయ్యారు. అలాగే నాగ్ అశ్విన్ కి విజయ్ కి ఉన్న అనుబంధంతో విజయ్ దేవరకొండ జాతి రత్నాలు లో ఓ స్పెషల్ కేరెక్టర్ చెయ్యడం యూత్ కి నిజంగా సర్ప్రైజ్. అలాగే నాగ్ అశ్విన్ మహానటి కీర్తి సురేష్ కూడా ఓ స్పెషల్ రోల్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. నవీన్ పోలిశెట్టి, కీర్తి సురేష్ కాంబో సీన్స్ ప్రోమోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరాలవడంతో.. జాతి రత్నాలులో స్పెషల్ గా గెస్ట్ రోల్స్ వేసిన కీర్తి సురేష్, విజయ్ దేవరకొండలను చూసి అందరూ సర్ప్రైజ్ అవుతున్నారు. అందుకే స్పెషల్ గా జాతిరత్నాలులో స్పెషల్ రత్నాల గురించి ఈ టాపిక్ మాట్లాడింది.

Vijay Devarakonda guest role in Jathi Ratnalu Movie:

Keerthy SUresh and Vijay Devarakonda Special role in Jathi Ratnalu Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs