Advertisement
Google Ads BL

రాధేశ్యామ్: రాదా నీరసం


ఇప్పటివరకు రాధేశ్యామ్ నుండి వచ్చిన ఏ ఒక్క అప్ డేట్ కూడా ప్రభాస్ రేంజ్ కి తగినట్లుగా లేదు. బాహుబలినే చూసుకుంటే ప్రభాస్ లుక్స్, ఆ రాచరికం, ఆ ఆహార్యం, బాడీ ఫిజిక్ అన్ని అంటే అన్నీ ఓ రేంజ్ లో ఉన్నాయి. కానీ రాధేశ్యామ్ కి వచ్చేసరికి ప్రభాస్ లుక్స్ మీదే బోలెడన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రభాస్ స్థాయికి, ప్రభాస్ ఇమేజ్ కి ప్రభాస్ రేంజ్ కి రాధేశ్యామ్ అప్ డేట్స్ ఏం సరిపోవడం లేదు. అసలు రాధేశ్యామ్ అప్ డేట్ వస్తుంది అని ఆతృతగా ఎదురు చూసినంతసేపు ఉండడం లేదు.. ప్రభాస్ రాధేశ్యామ్ లుక్స్. ఆ అప్ డేట్స్ చూస్తే ఫాన్స్ కి పూనకాలు రావడం అటుంచి నీరసాలు వచ్చేస్తున్నాయ్. మొన్నటికి మొన్న వాలంటైన్స్ డే రోజున వదిలిన రాధేశ్యామ్ గ్లిమ్బ్స్ చూసి ఫాన్స్ విలవిలలాడిపోయారు.

Advertisement
CJ Advs

ఇక తాజాగా ఎలాంటి అప్ డేట్ లేకుండా మహాశివరాత్రి స్పెషల్ అంటూ మార్చ్ 11 ఉదయాన్నే రాధేశ్యామ్ శివరాత్రి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. అబ్బా అంటూ.. హడావిడి లేకుండా వచ్చిన రాధేశ్యామ్ అప్ డేట్ చూసి ఫాన్స్ సంతోషపడేలోపు.. ఆ పోస్టర్ చూసి బాబోయ్ ప్రభాస్ అంటున్నారు. ఇది మా మాట కాదు. సోషల్ మీడియాలో ప్రభాస్ ఫాన్స్ వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. పాన్ ఇండియా రేంజ్ లో ఆకట్టుకోవాలంటే సం థింగ్ స్పెషల్ ఉండాలి.. కానీ ఇలాంటి పోస్టర్స్ తో ఏం చేద్దామనుకుంటున్నారు అంటూ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి తాజాగా వదిలిన రాధేశ్యామ్ పోస్టర్ లో ప్రభాస్ - పూజ హెగ్డే మంచులో పడుకున్న పోస్టర్ చూస్తే ఇంతకన్నా మంచి లుక్స్ టీం కి దొరకలేదా.. ఇలా అయితే రాధేశ్యామ్ మీద ఏం హైప్ క్రియేట్ అవుతుంది అంటూ ఫాన్స్ ఆ రాధేశ్యామ్ పోస్టర్ చూసి నీరసపడిపోతున్నారు.

Radhe shyam lacking interest:

Radhe Shyam Pan India Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs