Advertisement
Google Ads BL

సినిమా వాళ్లకి సిసలైన శివరాత్రి


రేపు మహాశివరాత్రి కి టాలీవుడ్ లో మహా రణరంగమే జరగబోతుంది. ఒక వైపు సినిమా రిలీజ్ లు. మరో వైపు సినిమాల కొత్త లుక్స్, అలాగే టీజర్స్ రిలీజ్ హడావిడి అంటూ పెద్ద రేంజ్ లోనే హంగామా జరగబోతుంది. శివరాత్రి స్పెషల్ గా ఇప్పటికే PSPK 27 లుక్ అండ్ టైటిల్ ఇవ్వబోతున్నట్టుగా టీం ప్రకటించింది. మహా శివరాత్రి పండగ సందర్భంగా సాయంత్రం 5.15 నిమిషాలకు PSPK 27 టైటిల్, PSPK 27 గ్లిమ్బ్స్ రిలీజ్ కి టైం ప్రకటించారు. మరోపక్క BB3 టైటిల్ కూడా ఈ శివరాత్రికి ఇవ్వొచ్చని నందమూరి అభిమానుల ఆశపడుతున్నారు. చిన్నా, పెద్దా సినిమాలు మహా శివరాత్రి స్పెషల్ పోస్టర్స్ తో ఎప్పటిలాగే హంగామా సృష్టించడానికి రెడీ అయ్యారు. మరో పక్క శర్వానంద్ - శ్రీ విష్ణు - నవీన్ పోలిశెట్టిలు బాక్సాఫీసు దగ్గర లక్కు పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. 

Advertisement
CJ Advs

అందరూ మహా శివరాత్రి జాగారం చేస్తే.. మన యంగ్ హీరోలు తమ సినిమా టెంక్షన్స్ లో జాగారం చేసేలా ఉన్నారు. ముగ్గురు హీరోలు భీబత్సమైన ప్రమోషన్స్ తో సినిమాలపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. శ్రీ విష్ణు గాలి సంపత్ తో, శర్వానంద్ శ్రీకారం తోనూ, నవీన్ పోలిశెట్టి జాతి రత్నాలు తోనూ బాక్సాఫీసు ఫైట్ కి సిద్ధమయ్యారు. ముగ్గురు హీరోలు ఏ విషయంలోనూ తగ్గడం లేదు. ఒకరిని మించి ఒకరు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. నవీన్ పోలిశెట్టి అయితే ఏకంగా ప్రీ రిలీజ్ టూర్ అంటూ యూత్ ని బుట్టలో వేసేశాడు. ఇక శ్రీకారంతో రెండు పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసి శర్వానంద్ శ్రీకారం పై హైప్ పెంచేసాడు. గాలి సంపత్ కూడా రాజేంద్ర ప్రసాద్, అనిల్ రావిపూడి క్రేజ్, శ్రీ విష్ణు పెరఫార్మెన్స్  తో సినిమాపై క్రేజ్ వచ్చేసింది. మరి మహా శివరాత్రి మహా జాగారం అనేకన్నా మహా రణరంగం అంటే బెటర్ గా ఉంటుందేమో కదా.

Maha Shivaratri - Maha Ranarangam:

Maha Shivaratri Maha Ranarangam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs