బాలయ్య బాబు గురించి అందరికి తెలిసిందే. ఒకసారి కథ విన్నాక లొకేషన్స్ కి వెళ్ళాక డైరెక్టర్ ఏం చెబితే అది చెయ్యడమే బాలయ్య పని. బోయపాటి శ్రీను బాలకృష్ణ తో చేస్తున్న BB3 ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. బాలయ్యబాబు డ్యూయల్ రోల్ చేస్తోన్న ఈ మూవీ కోసం పర్టిక్యూలర్ గా సెకండ్ క్యారెక్టర్ ని ఫస్ట్ ఒకలాగా చేద్దామనుకుని, తర్వాత ఇంకోలా చేద్దామనుకుని ఇలా ఏవేవో అనుకున్నాడు. కానీ అల్టిమేట్ గా ఫాన్స్ కానీ, ఆడియన్స్ గాని బాలకృష్ణ నుండి ఏం ఎక్సపెక్ట్ చేస్తున్నారో తెలుసుకుని.. దానికి సంబందించిన లుక్ డిజైన్ చేసాడు. దాని మీదే వెళుతున్నాడు. అదే కరెక్ట్ అని. బాలయ్య కూడా డైరెక్టర్ ని నమ్మాడు. ఇంతకుముందు సింహ టైం లో, లెజెండ్ టైం లో ఎలా అయితే బోయపాటి కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి బోయపాటిని నమ్మాడో.. ఇప్పుడు BB3 విషయంలోనూ బాలయ్య అదే చేస్తున్నాడు.
బోయపాటి ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మోస్ట్లీ బాలకృష్ణ డైరెక్టర్స్ ని నమ్మి చేసిన సినిమాలేవీ ఆయనకి ఫెయిల్యూర్స్ ని ఇవ్వలేదు. బోయపాటి కూడా బాగా కసిగా చేస్తున్న అవుట్ ఫుట్ కాబట్టి.. కన్వెక్షన్ తో చేస్తున్న మూవీ కాబట్టి.. ఈ సినిమా రిజల్ట్ ఒక రేంజ్ లో ఉంటుంది అని ఫాన్స్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు. ఆడియన్స్ ఎక్సపెక్ట్ చెయ్యొచ్చు. ఇక ప్రస్తుతం BB3 టైటిల్ గా బోయపాటి గాడ్ ఫాదర్ టైటిల్ ని అనుకుంటున్నాడు. గాడ్ ఫాదర్ టైటిల్ కి బాలయ్య కూడా మొగ్గు చూపుతున్నాడని.. త్వరలోనే BB3 టైటిల్ గా గాడ్ ఫాదర్ టైటిల్ ని ప్రకటించబోతున్నట్లుగా సమాచారం.