Advertisement
Google Ads BL

ఖమ్మంలో ప్యాకప్ చెప్పేసిన ఆచార్య టీం


చిరు - కొరటాల కాంబోలో తెర‌కెక్కుతున్న ప‌వ‌ర్ ఫుల్ మెగా ఎంట‌ర్ టైన‌ర్ ఆచార్య‌. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో  కాజ‌ల్ - పూజా హెగ్డే క‌థానాయిక‌లు. మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ - కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిరంజ‌న్ రెడ్డి- రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌లు. మహా శివరాత్రి కానుకగా రామ్ చరణ్ సిద్ద లుక్ రాబోతుంది అనే టాక్ ఉంది. స్పెషల్ గా రామ్ చరణ్ కేరెక్టర్ కి సంబందించిన టీజర్ ని ఆచార్య టీం రిలీజ్ చేయబోతున్నట్లుగా  టాక్.

Advertisement
CJ Advs

ఇక ఇటీవ‌ల ఖ‌మ్మం షెడ్యూల్ తో చిత్ర‌బృందం బిజీగా ఉంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవి- రామ్ చ‌రణ్ పై కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. తాజాగా ఈ షెడ్యూల్ విజ‌య‌వంతంగా పూర్త‌యింద‌ని నిర్మాత‌లు వెల్ల‌డించారు. నిర్మాత‌ల్లో ఒక‌రైన నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ-ఖ‌మ్మం షెడ్యూల్ ని ఎలాంటి ఆటంకాల్లేకుండా స‌క్సెస్ ఫుల్ గా పూర్తి చేసి తిరిగి హ‌ద‌రాబాద్ లో అడుగుపెట్టాం. చిరంజీవి -చ‌ర‌ణ్ పై కీల‌క స‌న్నివేశాల‌ను ఈ షెడ్యూల్ లో చిత్రీక‌రించాం అని తెలిపారు. 

ఈ సినిమా మే 13న థియేటర్లలోకి రానుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team Acharya completed a month long schedule in Rajahmundry and Illendu regions of AP and Telangana:

Team Acharya completed a month long schedule in Rajahmundry and Illendu regions of AP and Telangana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs