Advertisement
Google Ads BL

పుష్ప గురించి ఒకే మాట.. తగ్గేదే లే


చావు కబురు చల్లగా ఈవెంట్ కి అతిధిగా వచ్చిన అల్లు అర్జున్.. ఆ సినిమాతో పాటు తాను నటిస్తున్న పుష్ప ముచ్చట్లను అదే వేదికపై పంచుకున్నాడు. చావు కబురు చల్లగా సినిమా గురించి మట్లాడుతూ..  చావు కబురు ఎప్పుడూ చల్లగా చెప్పాలి. పుష్ప గురించి చివర్లో చెప్పాలి. ఈ సినిమా గురించి ఓ పిట్టకథ ఉంది. వాసు గురించి ఒక్క లైన్ లో చెప్పాలంటే నేను ఇవాళ ఇలా ఉన్నానంటే.. మా నాన్నగారి కంటే ఎక్కువ వాసు కారణం. గంగోత్రి నుంచి ట్రావెల్ అవుతున్నాం. అద్భుతమైన సినిమాలు చేసాడు. 100 పర్సెంట్ లవ్, గీత గోవిందం, భలేభలే లాంటి సినిమాలు చేసాడు. అలాంటి వాసుకు కథ నచ్చడం చిన్న విషయం కాదు. ఎక్కడ్నుంచి వచ్చింది కథ అంటే.. నవదీప్ విని మాకు పంపించాడు. నువ్వు ఇలా ఇచ్చినందుకు థ్యాంక్స్. శరత్ అంటే నాకన్నీ.. శరత్ నాతో పని చేస్తున్నాడు అనేకంటే నా ఫ్యామిలీ. అదేంటో నేనొక్కనే పెరిగితే సరిపోదు.. చుట్టు పక్కలా అంతా పెరగాలి. వాసు సింపుల్ గా మూడు ముక్కలు చెప్పాడు. చాలా బాగుంది కథ అన్నాను. ఇవాళ ఈ సినిమా నేను చూసాను. నా సినిమా గురించి నేను చెప్పలేను కానీ పక్కనోడి సినిమా గురించి చెప్పగలను. చాలా బాగుంది. దర్శకుడు కౌశిక్ గురించి చెప్పాలి. ఈ సినిమా చూస్తున్నపుడు ఏజ్ ఎంత అని వాసును అడిగాను. 26 ఏళ్ళకే ఇంత మెచ్యూరిటీనా.. నాకు రెండు మూడేళ్ల కింద వచ్చిన మెచ్యూరిటీ ఈయనకు ఇప్పుడే వచ్చింది.

Advertisement
CJ Advs

అందరికీ హిట్ ఇవ్వబోయే దర్శకుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు సిగ్గేసింది నీ మెచ్యూరిటీ చేసి. నేను మీకు బస్తీ బాలరాజు గురించి చెప్పాలి.. కార్తికేయ ఏజ్ ఎంత..? 27, 28 కి ఇంత బాగా చేస్తున్నారు. నేనేం చేసాను ఆ వయసులో.. వీళ్లేంటి ఇంత బాగా చేస్తున్నారు అనుకున్నాను. బస్తీ బాలరాజు గుండెల్లోకి వెళ్తారు. అణువణువు ఇంకిపోయి ఉన్నాడు. ఈ రోజు కార్తికేయ మాట్లాడిన విధానం చాలా బాగా నచ్చింది. సినిమా చూసిన తర్వాత బాలరాజు.. ఇప్పుడు మీ మాటలు బాగా నచ్చాయి. తన జెన్యూన్ వర్క్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాకు పని చేసిన బిజాయ్స్ నంబియార్ గారికి.. ఆయన మలయాళ సినిమా కల్కికి మంచి మ్యూజిక్ ఇచ్చారు. లావణ్య త్రిపాఠికి గీతా ఆర్ట్స్ లో మూడో సినిమా చేస్తుంది. ఆమె మా లక్కీ హీరోయిన్. ఆమని గారి గురించి చెప్పాలి.. మేం మీ సినిమాలు చూస్తూ పెరిగాం.. మీరెప్పుడెప్పుడు వస్తారా అని చూస్తున్నాం. ఈ రోజు మీకు ఇంత మంచి సినిమాతో వచ్చారు. అమ్మా చాలా బాగా చేసారు మీరు. శుభలగ్నం, మావిచిగురు లాంటి సినిమాలు చూస్తూ పెరిగాం. మా అందరికీ చాలా యిష్టమైన ఆర్టిస్ట్ మీరు. మీలాంటి వాళ్లు సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. 

ఇంకా ఎవర్నైనా మరిచిపోయుంటే క్షమించండి.. తెలుగు ప్రేక్షకులకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. థియేటర్స్ కు వస్తారా అనుకుంటే మీరు సినిమా తీయండి వస్తాం అని భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు. క్రాక్ గానీ, ఉప్పెన గానీ అందరికీ థ్యాంక్స్. వెళ్లేప్పుడు పుష్ప గురించి ఒక్కమాట చెప్పాలి. మీరు నా బలం.. ఆర్మీ.. ప్రాణం.. స్వతహాగా సంపాదించుకున్నానంటే అది కార్ కాదు, కోట్లు కాదు.. మీ అభిమానం మాత్రం. గర్వపడేంత వరకు తీసుకెళ్తాను. ఇది నా ప్రామిస్. సుమ గారికి థ్యాంక్స్. చావు కబురు చల్లగా మీకు కూడా నచ్చుద్ది. ఈ సినిమాలో కొత్త విషయం ఉంది. పుష్ప గురించి ఒకే మాట.. పుష్ప తగ్గేదే లే.. అంటూ పుష్ప సినిమాపై హైప్ క్రియేట్ చేసాడు అల్లు అర్జున్. 

One word about Pushpa, Taggedhe Le:

Allu Arjun says only one word about Pushpa and the crowd goes berserk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs