Advertisement
Google Ads BL

ఏమిటండి ఈ అభిమానం


స్టార్ హీరోలయినా చిన్న హీరోలయినా ఫాన్స్ కి పిచ్చ క్రేజ్ ఉంటుంది. అభిమాన తారలను చూసి వాళ్లతో సెల్ఫీ తీసుకుని ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసి వాళ్ళు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. అలాంటి అభిమానుల వలనే స్టార్ హీరోల రేంజ్, క్రేజ్ పెరుగుతుంది. స్టార్ హీరోల ఫాన్స్ వార్ లు బోలెడన్ని. ఇప్పటికి ఎప్పటికి ఈ ఫాన్స్ వార్ లు కొత్తకాదు, దానికి అంతం లేదు. ఇక తమకిష్టమైన హీరో స్టేజ్ ఎక్కాడంటే విజిల్స్ వేస్తూ.. వాళ్ళు మాట్లాడినా వినిపించనంతగా అల్లరి చేస్తుంటారు ఫాన్స్. హీరోల కోసం ప్రాణాలను సైతం లెక్క చెయ్యని అభిమానులు ఉన్నారు.

Advertisement
CJ Advs

రీసెంట్ గా చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఫాన్స్ ఇబ్బంది పెట్టిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత కొన్నాళ్లుగా అంటే ఆహా వన్ ఇయర్ సెలెబ్రేషన్స్, అలా వైకుంఠపురములో వన్ ఇయర్ సెలెబ్రేషన్న్ అప్పుడు మాత్రమే కనిపించిన అల్లు అర్జున్ కొన్ని రోజులుగా పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో పెద్దగా అభిమానులకి కనిపించడం లేదు. అలాగే పబ్లిక్ పంక్షన్స్ కి రావడం లేదు. లేటెస్ట్ గా చావు కబురు చల్లగా ఈవెంట్ కి హాజరైన అల్లు అర్జున్ పై అభిమానుల అభిమానం చూస్తే వార్ని బొందబడ ఏందీ ఈ అభిమానం అంటారు. అల్లు అర్జున్ స్టేజ్ ఎక్కగానే అభిమానులు స్టేజ్ పైకి దూసుకు వచ్చారు.

చావు కబురు చల్లగా సినిమా చూసా అని సినిమా చాలా బావుంది అంటూ మాట్లాడుతున్న అల్లు అర్జున్ పైకి అభిమానులు దూసుకురావడంతో అల్లు అర్జున్ కూడా ఒకింత అసహనానికి గురయ్యాడు. ప్లీజ్ కాసేపు ఆగండి ఐదు నిముషాలు మాట్లాడనివ్వండి అంటున్నా అభిమానులు.. అల్లు అర్జున్ ని వదల్లేదు. అల్లు అర్జున్ సెక్యూరిటీ, బౌన్సర్లు కూడా అభిమానులని కంట్రోల్ చెయ్యలేకపోయారంటే అభిమానులు అల్లు అర్జున్ పై ఎంత ప్రేమ చూపిస్తున్నారో. మరి చాలా రోజులకి పబ్లిక్ ఈవెంట్ కి హాజరైన అల్లు అర్జున్ ని ఆయన అభిమానులు ఎంతగా మిస్ అయ్యారో స్టేజ్ మీద అల్లు అర్జున్ మీద పడిపోయిన అభిమానులను చూస్తే అర్ధమవుతుంది.

Alllu Arjun Chief guest at Chavu Kaburu Challaga Pre Release Event:

Alllu Arjun as Chief guest at Chavu Kaburu Challaga Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs