టాలీవుడ్ లో మంచి ఫ్రెండ్స్ అయిన రానా - నితిన్ ఇద్దరూ ఒకే ఏడాది పెళ్లి పీటలెక్కారు. గత ఏడాది కరోనా క్రైసిస్ కారణంగా సైలెంట్ గా సింపుల్ గా పెళ్లిళ్లు చేసుకున్నారు ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ. నితిన్ తాను ప్రేమించిన షాలిని ని పెళ్లాడితే.. రానా కూడా ప్రేమించిన అమ్మాయి మెహికాని వివాహం చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన ఈ కొత్త పెళ్ళికొడుకులిద్దరూ మార్చి 26 న బాక్సాఫీసు బరిలోకి ఫైటింగ్ కి దిగబోతున్నారు. రానా అరణ్య అనే పాన్ ఇండియా ఫిలిం తో దిగుతుంటే.. నితిన్ క్యూట్ లవ్ స్టోరీ రంగ్ దే తో రంగంలోకి దిగుతున్నాడు.
రానా అరణ్య పై ట్రేడ్ లోను భారీ క్రేజ్ ఉంటే.. నితిన్ రంగ్ దే పై అటు మర్కెట్ లోను ఇటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలున్నాయి. అరణ్య తో పాన్ ఇండియా లెవల్లో రానా దిగుతున్నాడు. అన్ని భాషల్లోనూ అరణ్య ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు. నితిన్ కూడా వెంకీ అట్లూరి, హీరోయిన్ కీర్తి సురేష్ తో కలిసి రంగ్ దే పై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. మరి మార్చి 26 న అటు నితిన్ రంగ్ దే, ఇటు రానా అరణ్య సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. పెళ్లి కొడుకులుగా మారినప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒకళ్ళకొకళ్ళు విషెస్ చెప్పుకున్న రానా, నితిన్ లు ఇప్పుడు ఒకేసారి బాక్సాఫీసు దగ్గర తలపడబోతున్నారు. ఈ కొత్త పెళ్ళికొడుకులిద్దరూ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో విషెస్ చెప్పుకుంటారేమో చూద్దాం.