Advertisement
Google Ads BL

కమింగ్ అప్: పవన్-శృతి మాంటేజ్ సాంగ్


పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న విడుదల కాబోతుంది. ప్రస్తుతం దర్శకుడు వేణు శ్రీరామ్ - నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ ప్రమోషన్స్ హీట్ పెంచారు. గత ఏడాది మగువా మగువా సాంగ్ తో యూట్యూబ్ రికార్డ్స్ ని షేక్ చేసిన వకీల్ సాబ్.. ఈ ఏడాది టీజర్ తోనూ దడదడలాడించాడు. ఇక రీసెంట్ గా విడుదలైన సత్యమేవ జయతే సాంగ్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ఆ సాంగ్ బాగా వైరల్ అవడమే కాదు.. రికార్డ్ లైక్స్, షేర్స్ ఆ సాంగ్ కి వచ్చాయి. ఇక తాజాగా వకీల్ సాబ్ నుండి రాబోతున్న నెక్స్ట్ అప్ డేట్ ఏమిటి అంటే.. వకీల్ సాబ్ నుండి మరో సాంగ్ రిలీజ్ చేయబోతుంది వకీల్ సాబ్ టీం. 

Advertisement
CJ Advs

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ - శృతి హాసన్ మధ్యన వచ్చే మాంటేజ్ సాంగ్ ని రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్ ఇవ్వడమే కాకుండా థమన్ కూడా ఈ మాంటేజ్ సాంగ్ కోసం అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చినట్టుగా వినికిడి. ఈ పాట పవన్ కళ్యాణ్ స్టయిల్ లో ఉండబోతుందని.. వింటేజ్ పవన్ ని స్రీన్ పై చూపించబోతున్నారని వినికిడి. మరి ఈ సాంగ్ ఎన్ని రికార్డ్స్ ని సెట్ చేస్తుందో చూద్దాం.

Coming up: Pawan-Shruti montage song:

Vakeel Saab Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs