Advertisement
Google Ads BL

సింగర్ సిద్ శ్రీరామ్ పై మద్యం బాటిళ్లతో దాడి


తెలుగులో సిద్ శ్రీరామ్ అంటే తెలియని వారుండరు. సినిమాల్లో సిద్ శ్రీరామ్ సాంగ్ ఉంది అంటే.. సినిమానే హిట్ అనేలా ఉంది ప్రస్తుతం ఆయన ఆలపిస్తున్న గీతాలు చూస్తుంటే. సినిమా విడుదల కాకముందే సిద్ శ్రీరామ్ పాడిన పాటలు బాగా వైరల్ అయ్యి.. యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. అందుకే హీరోలంతా సిద్ పాట తమ సినిమాలో ఉండాలంటున్నారు. అంత మంచి పాపులర్ గాయకుడిపై మద్యం బాటిళ్ల దాడి అనే మాట వినగానే అభిమానులకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఇంతకీ విషయం ఏమిటి అంటే.. ఈమధ్యన హైదరాబాద్ లో ఓ పబ్ లో సిద్ శ్రీరామ్ స్పెషల్ ప్రోగ్రాం ఒకటి జరిగింది.

Advertisement
CJ Advs

ఆ ప్రోగ్రాం కి సిద్ శ్రీరామ్ వస్తున్నాడని చెప్పి పబ్ యాజమాన్యం ఇష్టానుసారంగా ఆంటే లిమిటెడ్ టికెట్స్ కాకుండా ఎక్కువ టికెట్స్ అమ్మడంతో.. ఆ పబ్ లోకి వందలాదిమంది అభిమానులు సిద్ పాట వినడానికి రావడమే కాకుండా.. అందులోని కొంతమంది ఆకతాయిలు సిద్ శ్రీరామ్ బ్యాండ్ పై మద్యం బాటిల్ ఓపెన్ చేసి నీళ్లు, మద్యం చల్లుతూ అల్లరి చేశారట. మద్యం బాటిల్స్ సిద్ శ్రీరామ్ బృందం పై విసిరి సిద్ ని ఘోరంగా అవమానించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటన జరిగిన చాలా రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. ఇక సిద్ శ్రీరామ్ ట్వీట్ చేస్తూ క్రమశిక్షణ ఉంటె ఎవరికీ భయపడక్కర్లేదు. మనసుని అదుపులో పెట్టుకుంటే పని చేసిన చోట ఎవరికీ భయపడక్కర్లేదు అంటూ ట్వీట్ చెయ్యడం సంచలనంగా మారింది.

Attack on a popular singer with bottles of alcohol:

Insult to singer Sid Sriram in a pub
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs