Advertisement
Google Ads BL

ప్రభాస్ నమ్మకం ఆ పవర్ ఫుల్ డేట్ పైనే!


ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో అనే పాన్ ఇండియా సినిమా చేసాడు. కానీ రాజమౌళిని వదిలేసాక తనకి ఆ రేంజ్ సక్సెస్ సాహో ఇవ్వలేకపోయింది. ఈసారి రాజమౌళి ప్రభాస్ కి దొరక్కపోయినా.. రాజమౌళి ని రాజుని చేసిన డేట్ ని ప్రభాస్ పట్టుకున్నాడు. అది ఏదో కాదు.. రాజమౌళి ని టాప్ డైరెక్టర్ ని చేసి ఇండస్ట్రీని బ్రేక్ చేసిన మగధీర సినిమా రిలీజ్ డేట్ జులై 30 ని ప్రభాస్ పట్టుకున్నాడు. ఇక్కడ కూడా రాజమౌళి తాలూకు రిప్లెక్షన్స్ ప్రభాస్ మీద ఉన్నాయి. ఈ జులై 30 డేట్ మళ్ళీ తనకి  మగధీర లాంటి హిట్ ఇస్తుంది.. ఇంకో ఇండస్ట్రీ హిట్ పడుతుంది అని తన రాధేశ్యామ్ పాన్ ఇండియా ఫిలిం కోసం జులై 30 ని లాక్ చేసుకున్నాడు.

Advertisement
CJ Advs

మరి రాజమౌళి ని టాప్ డైరెక్టర్ ని చేసిన మగధీర రామ్ చరణ్ ని స్టార్ హీరోని చెయ్యడమే కాదు.. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని టాప్ లెవల్లో కూర్చోబెట్టింది. మగధీర సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడమే మాత్రమే కాదు.. మునుపటి రికార్డులని అన్నీ తుడిచిపెట్టేసింది. అందుకే ప్రభాస్ ఆ జులై 30 డేట్ ని బాగా ఇష్టపడుతున్నాడు. నమ్ముతున్నాడు. సాహో తో తగిలిన దెబ్బ రాధేశ్యామ్ విషయంలో రిపీట్ కాకూడదంటూ రాజమౌళి మగధీర డేట్ ని ప్రభాస్ రాధేశ్యామ్ కోసం వాడేస్తున్నాడు. రాధేశ్యామ్ జులై 30 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా హిట్ కోసం ప్రభాస్ కూడా ఎదురు చూస్తున్నాడు.

Prabhas believe on that date:

Radhe Shyam to release july 30th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs