Advertisement
Google Ads BL

సీటిమార్ టీమ్ కి కొత్త టెన్షన్


సంపత్ నంది - గోపీచంద్ కాంబోలో తెరకెక్కిన సీటిమార్ మూవీ ఏప్రిల్ 2 న రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే రిలీజ్ కి దగ్గరపడుతున్న వేళ సీటిమార్ టీం కి కొత్త టెంక్షన్ మొదలయ్యింది. అదేమిటి అంటే.. బాలీవుడ్ లో అయితే  స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు బాగా ఆడిన దాఖలాలు ఉన్నాయి. అదే తెలుగుకి వచ్చేసరికి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలే చాలా తక్కువ. జగపతి బాబు కబడ్డీ కబడ్డీ, మహేష్ బాబు ఒక్కడు సినిమాలో కబడ్డీ గేమ్ ఇలా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాలు. అదే స్పోర్ట్స్ డ్రామాలు తెలుగులో ఆడిన సందర్భాలు చాలా తక్కువ.

Advertisement
CJ Advs

ఇక నిన్నటికి నిన్న రిలీజ్ అయిన సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ .. హాకీ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమా. దానికి చాలా హార్డ్ వర్క్ చెయ్యడమే కాదు.. పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు. కానీ A1 ఎక్స్ ప్రెస్ రిజల్ట్ మాత్రం అనుకున్న రేంజ్ లో లేదు. ఇప్పుడు సీటిమార్ టీం టెంక్షన్ కూడా అదే. జనరల్ గా ఒక యాక్షన్ ఎంటర్టైనర్, లేదంటే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ తో వెళ్ళిపోతే ఈ టీం కి ఎలాంటి టెంక్షన్, ప్రాబ్లెమ్ ఉండేది కాదు. ఎప్పుడైతే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఎంటర్టైనర్ తో వెళుతున్నారో.. ఈ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఆడియన్స్ కి ఎంతవరకు రీచ్ అవుతుంది.. మనల్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో అనే టెంక్షన్ స్టార్ట్ అయ్యింది. సీటిమార్ సినిమా కబడ్డీ నేసథ్యంలో తెరకెక్కిన సినిమా. గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్ లుగా సీటిమార్ సినిమాలో కనిపించబోతున్నారు. మరి సంపత్ నంది - గోపీచంద్ లు ఆడియన్స్ ని ఈ సీటిమార్ తో ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం.

New tension for the Seetimaarr team:

Gopichand and Tamannaah starrer Seetimaarr to release April 2nd
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs