Advertisement
Google Ads BL

రాంగ్ ట్రాక్ లో వకీల్ సాబ్


బాలీవుడ్ లో తెరకెక్కిన పింక్ అనే సినిమా ఫెమినిజం బేస్ చేసుకుని తీసిన సినిమా. ఆడవారి మీద జరిగే అకృత్యాలకు, అరాచకాలకు సమాధానం చెప్పిన సినిమా. అందుకే ఆ సినిమా బాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యింది. సౌత్ నుండి బాలీవుడ్ కి అడుగుపెట్టిన తాప్సిని సడన్ గా స్టార్ హీరోయిన్ ని చేసింది. అమితాబచ్చన్ ఎక్సట్రార్డినరీ పెరఫార్మెన్స్ తో పింక్ సినిమాకి అంత క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత పింక్ సినిమాని తమిళ్ లోకి తీసుకువచ్చినా.. స్టార్ హీరో అయిన అజిత్ కూడా ఆ కేరెక్టర్ కి లోబడే పెర్ఫార్మ్ చేసాడు. అందుకే తమిళ్ లో కూడా పింక్ రీమేక్ సక్సెస్ అయ్యింది.

Advertisement
CJ Advs

కానీ తెలుగు కి వచ్చేసరికి పింక్ రీమేక్ వకీల్ సాబ్ లో హీరోయిజం ఎక్కువైపోయింది అనే కంప్లైంట్ ఉంది. అది వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలినప్పటినుండి చాలామంది ప్రేక్షకుల మాటగా వినబడుతుంది. గత ఏడాది రిలీజ్ అయిన మగువా మగువా సాంగ్ పక్కనబెడితే.. రీసెంట్ గా విడుదలైన సత్యమేవ జయతే సాంగ్ పవన్ కళ్యాణ్ ఓన్ సాంగ్ గా వుంది, జనసేన పార్టీ సాంగ్ లా ఉంది తప్ప కథలో మెల్ట్ అయిన సాంగ్ లాగా.. కథకి రిలేటెడ్ అయిన సాంగ్ లా లేదు. దీని మీద ఆల్రెడీ కాంట్రవర్సీస్ జరిగాయి. సత్యమేవ జయతే సాంగ్ రాసిన రామజోగయ్య శాస్త్రి కూడా దీని మీద ట్విట్టర్ వేదికగా అపాలజీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వకీల్ సాబ్ పోస్టర్ లో కూడా ఉమెన్స్ ఎలివేట్ అవ్వలేదు. మహిళలను సెక్యూర్ చేస్తున్న వకీల్ సాబ్ ఎలివేట్ అయ్యాడు. 

ఇప్పటికి పింక్ రీమేక్ వకీల్ సాబ్ ని హీరోయిజమే డామినేట్ చేస్తుంది. అసలు పింక్ కథ అది కాదు. ఇది ఆడియన్స్ ని రాంగ్ గైడెన్స్ లోకి తీసుకెళ్తుంది. నిజానికి వకీల్ సాబ్ సినిమా స్టార్ట్ అయ్యాక 30, 40 మినిట్స్ కి కానీ పవన్ కళ్యాణ్ ఎంటర్ కారు సినిమాలోకి. అదే విషయాన్నీ ఫాన్స్ కి ఆడియన్స్ కి ముందే చెబితే బావుండేది. ఇది హీరో సినిమాలాగే ప్రాజెక్ట్ చేస్తున్నారు ఫాన్స్ కూడా పవన్ విషయంలో హీరోయిజం విషయంలో హోప్స్ పెంచుకుంటారు. వకీల్ సాబ్ ప్రమోషన్స్ మొత్తం రాంగ్ ట్రాక్ లో వెళుతుంది సినిమా. ఇప్పటికైనా వకీల్ సాబ్ టీం రియలైజ్ అయితే బావుంటుంది. 

Vakeel Saab on the wrong track:

Vakeel Saab womens day special poster
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs