Advertisement
Google Ads BL

శర్వానంద్ ప్లాన్స్ వేరయా


మహాశివరాత్రి కి శ్రీకారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శర్వానంద్.. శ్రీకారం సినిమా ప్రమోషన్స్ విషయంలో కాస్త లైట్ గా ఉన్నాడేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అదే రోజు విడుదల కాబోతున్న జాతి రత్నాల పబ్లిసిటీ, గాలి సంపత్ పబ్లిసిటీ  ముందు శ్రీకారం ప్రమోషన్స్ వీక్ అనిపించాయి. జాతి రత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా సినిమాపై అంచనాలు పెంచేసాడు. విజయ్ జాతి రత్నాలు గురించి మాట్లాడడం, స్టార్ రేంజ్ లో పాన్ ఇండియా ఫిలిం చేస్తున్న విజయ్ రాకతో ఇప్పటికే హైప్ ఉన్న జాతి రత్నాలు పై మరింత క్రేజ్ పెరిగింది. ఇక శ్రీ విష్ణు బ్రోచేవారెవరురా అంటూ కామెడీ హిట్ కొట్టి ఇప్పుడూ రాజేంద్ర ప్రసాద్ తో గాలి సంపత్ అంటూ రాబోతున్నాడు. ఓ పక్క బ్యాక్ బోన్ గా అనిల్ రావిపూడి, మరోపక్క క్రేజీ హీరో రామ్ గాలి సంపత్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

Advertisement
CJ Advs

అయితే శర్వానంద్ కూడా తన ప్లాన్స్ లో ఉన్నాడు. గురువారం విడుదల కాబోతున్న శ్రీకారం సినిమాకి ఏకంగా రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేసుకున్నాడు. అందులో ఖమ్మంలో జరగబోయే ఈవెంట్ కి మెగాస్టార్ చిరు అతిధిగా రాబోతున్నారు. ప్రస్తుతం ఇల్లేందులో ఆచార్య షూటింగ్ లో ఉన్న చిరు కోసం శ్రీకారం ఈవెంట్ ని శర్వానంద్ అండ్ నిర్మాతలు కలిసి ఖమ్మంలో ఈ రోజు ఈవెనింగ్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మరోపక్క పొలిటికల్ గాను శర్వా దూకుడు మీదున్నాడు. అదెలా అంటే రేపు హైదరాబాద్ లో జరగబోయే శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఆహ్వానించారు. రెండు రోజులు రెండు పెద్ద ఈవెంట్స్ తో శర్వానంద్ శ్రీకారం పై క్రేజ్ పెంచేస్తున్నాడు. మరి మహాశివరాత్రి పోరులో శ్రీ విష్ణు గెలుస్తాడా? నవీన్ పోలిశెట్టి గెలుస్తాడా? లేదంటే శర్వానంద్ శ్రీకారం తో హిట్ కొడతాడో? చూద్దాం.

Megastar Chiranjeevi to grace Sreekaram Pre release event:

Chiru and KTR To Grace Sharwa Sreekaram Pre Release Events
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs