Advertisement
Google Ads BL

అవకాశాల కోసం మెగా హీరోలకి ఫోన్


ప్రస్తుతం సీనియర్ యాక్టర్లు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్స్ సీనియర్ యాక్టర్స్ ని పక్కనబెట్టేసి.. పరభాషా నటుల కోసం ఎగబడుతున్నారు. ఒకప్పుడు టాప్ విలన్ గా, కమెడియన్స్ గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం అవకాశాలు కోసం అందరికి ఫోన్స్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు కొందరు సీనియర్స్. అందులో ముఖ్యంగా గతంలో వందల సినిమాల్లో కామెడీ పండించి.. చాలా సినిమాల్లో విలన్ గా పెరఫార్మ్ చేసి అద్భుతమైన పేరు తెచ్చుకున్న విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు.. ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చెయ్యాల్సిన పరిస్థితి. గతంలో జనతా గ్యారేజ్ సినిమా విషయంలో మోహన్ లాల్ ఎంతో బాగా చేసారు.. ఎన్టీఆర్ పెదనాన్న గా మోహన్ లాల్ నటన అద్భుతం అన్నవారికి కోట క్లాస్ పీకారు. తెలుగులోనూ అద్భుతమైన నటులు ఉన్నారు. కానీ వాళ్ళని పక్కనబెట్టేసి పర భాషా నటుల కోసం ఎదురు చూస్తున్నారంటూ అప్పట్లోనే కొంతమంది దర్శకులకు ఇండైరెక్ట్ గా చురకలు వేశారు కోటా.

Advertisement
CJ Advs

గతంలో 20 గంటలు పని చేసిన కోటా ఇప్పుడు ఖాళీగా కూర్చోవడం నచ్చడం లేదంటున్నారు. కానీ తనకి వయసైపోయింది అని, తన ఆరోగ్యం బాగోలేదని తనకి అవకాశాలు ఇవ్వడం లేదని, కానీ తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా అని, మోకాళ్ళ నొప్పులు తప్ప తనకెలాంటి ఇబ్బందులు లేవంటున్న కోట శ్రీనివాసరా రావు లాక్ డౌన్ టైం లో ఖాళీగా కూర్చిపోలేకపోయా అని, లాక్ డౌన్ ముగిసాక కూడా ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదంటూ వాపోతున్నారు. అదే విషయాన్ని మీడియా ముఖంగా చెబుతున్నారు కూడా. తనకి డబ్బు, పారితోషకాలు ముఖ్యం కాదని వేషాలు ముఖ్యమంటున్నాడాయన. అందుకే మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో పాటుగా వి. వి .వినాయక్, త్రివిక్రమ్ లాంటి దర్శకులకు ఫోన్ చేసి అవకాశాల కోసం అడిగా అని చెబుతున్నారాయన.

అయితే రీసెంట్ గా కోట గారు పవన్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న PSPK 27 లో నటిస్తున్నట్లు చెబుతున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్‌తో నటించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. కాకపోతే తెలుగు రాని నటులని తెలుగులోకి తీసుకొచ్చి.. గౌరవం ఇస్తూ.. ఇక్కడ మంచి నటీనటుల్ని పక్కన బెట్టడం తనకి నచ్చలేదంటూ మొహమాటం లేకుండా చెబుతున్నారు కోటా.

Phone to mega heroes for opportunities:

Kota Srinivasa Rao called Chiranjeevi,Pawan Kalyan and asked for opportunities
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs