ఎన్టీఆర్ RRR మూవీతో పాన్ ఇండియా లోకి అడుగుపెట్టబోతున్నారు. రాజమౌళి RRR తర్వాత తారక్ వెంటనే త్రివిక్రమ్ మూవీకి జంప్ అవుతాడు. అసలైతే తారక్ - త్రివిక్రమ్ మూవీ మొదలు కావాల్సి ఉండగా.. మధ్యలో పవన్ ఏకే రీమేక్ తో త్రివిక్రమ్ కాస్త బిజీ అవడంతో ఎన్టీఆర్ మూవీ రెండు నెలలు పోస్ట్ పోన్ అయ్యింది. మరి అక్టోబర్ 13 వరకు ఎన్టీఆర్ ని చూడలేము అనుకున్న ఫాన్స్ కి ఇప్పుడు గుడ్ న్యూస్ వినబడుతుంది. మూడేళ్ళ క్రితం, బుల్లితెర మీద బిగ్ బాస్ అంటూ హోస్ట్ గా బుల్లితెర ప్రేక్షకులను పలకరించిన ఎన్టీఆర్.. మరోమారు ఫాన్స్ ని సర్ప్రైజ్ చేస్తూ బుల్లితెర మీద అడుగుపెడుతున్నారు.
గతంలో నాగార్జున, చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ ప్రేక్షకులని పిలిచి ప్రశ్నలు వేసి.. మంచి టీఆర్పీస్ తీసుకొస్తే.. ఇప్పడూ ఎన్టీఆర్ జెమిని టివిలో ఎవరు మీలో కోటీశ్వరులు? అనే రియాల్టిటి షో కి హోస్ట్ చెయ్యబోతున్నాడు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షో స్టార్ మాలో వస్తే.. ఈ ఎవరు మీలో కోటీశ్వరులు? షో మాత్రం జెమిని ఛానల్ లో ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలు కాబోతుంది. ఇప్పటికే ఎవరు మీలో కోటీశ్వరులు? షో కి సంబందించిన ఎపిసోడ్స్ మొదలు కావడం, ఎన్టీఆర్ హాజరవడంతో.. ఆ ప్రోమోస్ ని జెమిని ఛానల్ వారు ప్లే చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ ని హైడ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ని చూపించకుండా ప్రోమోస్ కట్ చేసి ఫాన్స్ లో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నారు.
అయితే ఎన్టీఆర్ పేరు బయటకి రాకుండా జెమిని ఛానల్ ప్రస్తుతం హైప్ క్రియేట్ చేస్తున్నా.. త్వరలోనే ఎన్టీఆర్ పేరు ని గ్రాండ్ గా అనౌన్సు చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి సినిమాలంటే ఏడాదికో రెండేళ్లకో మాత్రమే కనిపిస్తారు. ఇలా బుల్లితెర షోస్ అంటే ఎన్టీఆర్ దాదాపుగా ప్రేక్షకులకి, ఫాన్స్ కి దగ్గరగా ఉన్నట్టే అంటున్నారు.