Advertisement
Google Ads BL

పవన్ అభిమానిని మాత్రమే


పవన్ కళ్యాణ్ తో అశు రెడ్డి ఓ ఫోటో దిగి సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి.. నా దేవుడు పవన్ కళ్యాణ్ తో ఫోటో.. నా జన్మ ధన్యం, మీరు ఎప్పుడూ నా ఫస్ట్ లవ్ పవన్ కల్యాణ్ అని పోస్ట్ చెయ్యడంతో.. పవన్ నాలుగో పెళ్లి చేసుకుంటా అంటే చేసుకుంటావా అని ఆశు ని అడిగిన నెటిజెన్ కి ఆశు రెడ్డి పవన్ సరే అనాలే కానీ.. నేను నాలుగో భార్యగా రెడీ అంటూ ఆశు రెడ్డి చేసిన కామెంట్స్ చేసింది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. ఆశు రెడ్డి ని ట్రోల్ చేసారు. దానితో హార్ట్ అయిన ఆశు రెడ్డి ఘాటుగానే స్పందించింది.

Advertisement
CJ Advs

నేను పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిని మాత్రమే. ఎప్పటికి అభిమానిలాగే ఉంటాను. ఆయన సెట్స్ లో అందరితో బావుంటారు.. అలానే నాతో ఉన్నారు. నా మీద పవన్ మీద తప్పుడు వార్తలు రాస్తే బావుండదు అంటూ వార్నింగ్ ఇస్తుంది ఆశు రెడ్డి. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ లో నటులను, టెక్నీకల్ టీం ని సత్కరిస్తూ వారితో ఫొటోస్ దిగడమే కాకుండా.. వారిని అభినందిస్తూ లెటర్స్ కూడా రాయడంతో.. ఆ లెటర్ తో పాటుగా ఆశు రెడ్డి పవన్ తో దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో ఆశు రెడ్డిని నెటిజెన్స్ నానా రకాలుగా ఆడుకున్నారు. పవన్ తనకి దేవుడితో సమానమని, ఎదుటి వారి మనోభావాలు దెబ్బతినేలా పిచ్చి రాతలు రాయడం కరెక్ట్ కాదని, ఇలాంటి వాటిపై స్పందించాల్సిన అవసరం లేకపోయినా.. నాకు ఓపిక నశించి ఇలా స్పందిస్తున్నా అంటూ ఓ వీడియోని రిలీజ్ చేసింది ఆశు రెడ్డి.

Ashu Reddy reacts on social media trolls:

Ashu Reddy Fires On Trolls Over Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs