Advertisement
Google Ads BL

కంగనా చేతికి దొరికిన తాప్సి


బాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా కంగనా రనౌత్ vs తాప్సి అన్నట్టుగా వారి మధ్యన మాటల యుద్ధం జరుగుతుంది. కంగనా బి గ్రేడ్ హీరోయిన్స్ అంటూ తాప్సి ని ఎత్తి పొడవడం, వాటికి తాప్సి కస్సున లేవడం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. తాప్సి సౌత్ నుండి వచ్చి బాలీవుడ్ లో సెటిల్ అయిన హీరోయిన్ కావడంతో.. బాలీవుడ్ లో తానే టాప్ అని ఫీల్ అయ్యే కంగనా తాప్సి ని అవమానిస్తూనే ఉంటుంది. ఇక బాలీవుడ్ బడా దర్శకనిర్మాత అయిన అనురాగ్ కశ్యప్ పై కూడా కంగానా ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూనే ఉండేది. అనురాగ్ చీటర్ అంటుండే కంగనాకు ఇప్పుడు తాప్సి, అనురాగ్ కశ్యప్ లు ఐటి దాడుల విషయంలో అడ్డంగా దొరికారు. పన్నులు ఎగవేత విషయంలో తాప్సి, అనురాగ్ కశ్యప్ లపై ఐటి దాడులు జరిగిన విషయం తెలిసిందే.

Advertisement
CJ Advs

తాజాగా కంగనా తాప్సి, అనురాగ్ కశ్యప్ లపై ట్విట్టర్ లో సెన్సెషనల్ కామెంట్స్ చేసింది. తాప్సిని ఓ దిగజారిన వ్యక్తిగా సంబోదించడమే కాదు.. అనురాగ్ కశ్యప్ తాప్సికి ఓ రింగ్ మాస్టర్ లాంటి వాడు అంటూ ట్వీట్ చెయ్యడమే కాదు, 2013 లోనే అనురాగ్ కశ్యప్ ఇంటిపై ఐటి దాడి జరిగింది కానీ అందులో నిర్దోషిగా అనురాగ్ ప్రూవ్ అవ్వలేదని, అది నిరూపించుకుని బయటికి రావాలి అంటూ సవాల్ చేసింది. మరోపక్క తాప్సి తనపై జరిగిన ఐటి దాడుల విషయంపై స్పందించింది. తాను ఎలాంటి తప్పు చెయ్యలేదని, తనకి పారిస్ లో ఓ బంగ్లా ఉందని ఆ బంగ్లా కీ కోసం తన ఇంటికి వచ్చి ఐటి అధికారులు వెతికారని, కానీ తనకి పారిస్ లో ఎలాంటి ఇల్లు లేదని చెప్పిన తాప్సి.. తాను ఎలాంటి తప్పు చెయ్యలేదంటుంది.

Kangana vs Tapsee:

Kangana vs Tapsee
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs