Advertisement
Google Ads BL

ఆఫీషియల్: దుశ్యంత్ గా దేవ్ మోహన్


గుణశేఖర్ దర్శకనిర్మాతగా శాకుంతలం పాన్ ఇండియా ఫిలిం తెరక్కబోతున్న విషయం తెలిసిందే. ఇండియా లోని పలు భాషల్లో ఈ శాకుంతలం ని గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. శాకుంతలం లో మెయిన్ లీడ్ కేరెక్టర్ శకుంతల గా సమంత అక్కినేని నటించబోతుంది. శకుంతలాగా సమంత ఇప్పటికే లుక్ టెస్ట్ లో పాల్గొనడం శకుంతల లుక్ ఫైనల్ అవ్వడం జరిగిపోయింది. అలాగే శాకుంతలం కాస్ట్యూమ్స్, ఇంకా శాకుంతలం కి సంబంధించిన సెట్ వర్క్ లో శాకుంతలం టీం బిజీగా వుంది. సమంత కూడా అప్పుడప్పుడు శాకుంతలం చర్చల్లో కూడా పాల్గొంటుంది. 

Advertisement
CJ Advs

అయితే సమంత సరసన అంటే శకుంతల సరసన నటించబోయే దుశ్యంతుడు గురించిన సస్పెన్స్ కొన్ని రోజులుగా హైలెట్ అవుతుంది. అన్ని భాషలకు సరిపోయే మంచి అందం, బాడీ లాంగ్వేజ్ ఉన్న నటుడి కోసం గుణశేఖర్ వేటలో ఉన్నాడని అన్నారు. మధ్యలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ శాకుంతలం దుశ్యంతుడు కేరెక్టర్ లో చేయబోతున్నాడనే టాక్ నడిచింది. హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం కాబట్టి ఎవరూ దుశ్యంతుడు కేరెక్టర్ చెయ్యడానికి ఒప్పుకోవడం లేదు.. తమ పాత్ర పరిధి తగ్గుతుంది అని భావించి నో చెబుతున్నారని.. అందుకే సమంత రెడీగా ఉన్నా.. శాకుంతలం ఇంకా పట్టాలెక్కలేదు అని అన్నారు. అయితే ఇప్పుడు శాకుంతలం దుశ్యంతుడు దొరికేసాడు. శకుంతల సరసన దుశ్యంతుడు కేరెక్టర్ ని మలయాళ నటుడు దేవ్ మోహన్ చెయ్యబోతున్నట్టుగా శాకుంతలం టీం అధికారికంగా ప్రకటించింది.దేవ్ మోహన్ శాకుంతలం దుశ్యంతుడు అంటూ వీడియో రూపంలో పేరుని బయటపెట్టారు..

Official: Dev Mohan as Dushyant:

Dev Mohan as Dushyant in Shakuntalam Pan India Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs