Advertisement
Google Ads BL

సంపత్ కోసం రామ్.. రత్నాలు కోసం రౌడీ స్టార్


మహాశివరాత్రికి ముగ్గురు యంగ్ హీరోలు పోటీ పడుతున్నారు. మూడూ మీడియం బడ్జెట్ మూవీస్ కావడం, మూడు సినిమాల ట్రైలర్స్ ఆసక్తికరంగా ఉండడంతో.. ఇప్పుడు ముగ్గురు హీరోలు పోటాపోటీ ప్రమోషన్స్ తో సినిమాలపై అంచనాలు పెంచేస్తున్నారు. శర్వానంద్ శ్రీకారం మూవీ తో రెడీ అయితే.. శ్రీ విష్ణు గాలి సంపత్ అంటున్నాడు. మరోపక్క నవీన్ పోలిశెట్టి జాతి రత్నాలతో కవ్విస్తున్నాడు. శ్రీ విష్ణు - రాజేంద్ర ప్రసాద్ కాంబోలో వస్తున్న గాలి సంపత్ కామెడిగాను, ఎమోషనల్ గాను కనిపిస్తుంటే.. శ్రీకారం తో వ్యవసాయాన్ని కొత్తగా చూపించబోతున్నాడు శర్వానంద్. ఇక నవీన్ పోలిశెట్టి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తో కలిసి జాతి రత్నాలు అంటూ కామెడీ కామెడీ చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఇప్పటికే నవీన్ పోలిశెట్టి ప్రీ రిలీజ్ టూర్ అంటూ జాతి రత్నాల ప్రమోషన్స్ ని నెక్స్ట్ లెవెల్ లో చేపట్టాడు. కాలేజెస్ చుట్టూ తిరుగుతూ జాతిరత్నాలను ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా జాతి రత్నాల ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రౌడీ స్టార్ విజయ్ దేవరకోండని దింపుతున్నారు. ప్రస్తుతం లైగర్ షూటింగ్ లో ముంబైలో బిజీగా వున్న విజయ్ దేవరకొండ జాతి రత్నాల ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రాబోతున్నాడు. మరోపక్క అనిల్ రావిపూడి ఆధ్వర్యంలో తెరకెక్కిన గాలి సంపత్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఉస్తాద్ రామ్ ని దింపుతున్నారు. ఇస్మార్ట్ హిట్ కొట్టిన రామ్ క్రేజ్ ని గాలి సంపత్ కి వాడేస్తున్నారు. మరి యంగ్ హీరోలు పోటా పోటీగా సినిమా ప్రమోషన్స్ తో తమ సినిమాలపై అంచనాలు పెంచేస్తున్నారు. మరి ఈ మహా శివరాత్రి కి ఏ యంగ్ హీరో హిట్ కొట్టబోతున్నాడో.. జస్ట్ వైట్ అండ్ సి.

Ustaad Ram as chief guest for Gaali Sampath Pre-Release Event tomorrow:

Rowdy Star Vijay Devarakonda as chief guest for Jathi Ratnalu Pre-Release Event tomorrow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs