Advertisement
Google Ads BL

అమ్మాయిలంతా ఎదవలకే పడతారంటా


మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారు పేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం చావు క‌బురు చ‌ల్ల‌గా. ‌ తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. అదిరిపోయే కామెడీ సీన్స్.. అద్భుతమైన ఎమోషన్.. మంచి కథతో అన్ని కమర్షియల్ హంగులు అద్దుకున్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్, హీరో కార్తికేయ బ‌స్తి బాల‌రాజు ఫ‌స్ట్ లుక్, ఇంట్రోతో పాటు క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు, క‌దిలే కాలాన్ని, పైన పటారం లోన లొటారం పాటల‌‌కు అనూహ్య స్పంద‌న ల‌భించింది. తాజాగా ట్రైలర్ కూడా అదే రకంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రికి మంచి రెస్పాన్స్ వస్తుంది. 

Advertisement
CJ Advs

ఆకలి నిద్ర మూర్ఖత్వం ఇవి కాకుండా.. 

జాలి దయ మానవత్వం అంటే ఏంటో తెలుసారా నీ మనస్సాక్షికి..

అమ్మాయిలందరూ ఎదవలకే పడతారంటారు.. అందులో నేను నెంబర్ వన్.. నన్ను మించిన ఆప్షన్ ఎక్కడ ఉంటుంది నీకు..

ఇందాక ఫోన్ లో చూసావే.. నాది యాక్టింగ్ మాత్రమే.. నువ్వు ఎక్కువ చేసావ్ అనుకో.. నీకు ఒరిజినల్ పడిపోద్ది.. 

అంటూ ట్రైలర్ లో వచ్చే డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి మాట్లాడుతూ ఇప్ప‌టికే చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రం నుంచి విడుద‌ల చేసిన ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య స్పంద‌న వస్తుంది. మాస్ అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే ట్రైలర్ కూడా వచ్చింది అని తెలిపారు. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.

Chaavu Kaburu Challaga Trailer release:

<span>Chaavu Kaburu Challaga trailer&nbsp;</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs