డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాక్సిడెంట్ చేసి మూడు కార్ల డ్యామేజ్ కి ఓ వ్యక్తి హాస్పిటల్ పాలవడానికి కారణమైన యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ పోలీస్ స్టేషన్ లో చేసిన రచ్చ వీడియోస్ సోషల్ మీడియాలో ఎంతెలా వైరల్ అయ్యాయో చూసాం. దీప్తి సునయన బాయ్ ఫ్రెండ్ గా, యూట్యూబ్ స్టార్ గా, వెబ్ సీరీస్ లు చేస్తుండే షణ్ముఖ్ జశ్వంత్ ఈ మధ్యన బుల్లితెర మీద బాగా హైలెట్ అవుతున్నాడు. రీసెంట్ గా మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసి.. నా వలన ఎవరూ హాస్పిటల్ పాలవలేదు.. డబ్బులిస్తాను మాట్లాడుకుందాం అంటూ మద్యం మత్తులో రచ్చ రచ్చ చేసిన షణ్ముఖ్ జశ్వంత్ పై పోలీస్ కేసు నమోదు కావడం షణ్ముఖ్ జశ్వంత్ కి పేరెంట్స్ సమక్షంలో కౌన్సిల్ కి రావాలంటూ పోలీస్ లు చెప్పారు.
కానీ షణ్ముఖ్ జశ్వంత్ మాత్రం కౌన్సిలింగ్ కి రాకుండా పోలీస్ లను ముప్పుతిప్పలు పెడుతున్నాడట. అతను పోలీసులు చెప్పినా కౌన్సిలింగ్ కి హాజరవకుండా పెద్ద పెద్ద వాళ్లతో ఫోన్ చేయించి మ్యానేజ్ చెయ్యడానికి చూస్తున్నట్లుగా చెబుతున్నారు. పోలీసులు మాత్రం కుదరదు కౌన్సిలింగ్ కి రావాల్సిందే అని షణ్ముఖ్ జశ్వంత్ కి చెప్పినా అతను వినడం లేదని, కౌన్సిలింగ్ కి రాకుండా తప్పించుకునే ఏర్పాట్లలో ఉన్నాడంటున్నారు.