Advertisement
Google Ads BL

సొంత నేతలకే వార్నింగ్ ఇచ్చిన బాలయ్య


బాలకృష్ణ ఇప్పుడు అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో ఫుల్ బిజీ. బోయపాటి తో BB3 షూటింగ్ అలాగే ఏపీలో నిన్నటివరకు పంచాయితీ ఎలక్షన్స్ ప్రచారం, నేడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ప్రచారంతో బాలయ్య దూకుడు మాములుగా లేదు. బాలకృష్ణ మాట్లాడుతున్నారు అంటే ఆయన అభిమానులకి పూనకాలే. బాలయ్య మాట తడబడినా ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ కి అభిమానుల విజిల్స్ మాములుగా ఉండవు. అయితే బాలకృష్ణ స్టేజ్ ఎక్కినా, ప్రజల్లోకి వెళ్లినా ఆవేశంతో ఒక్కోసారి మాట తడబడడం, అలాగే ఆయన మాట్లాడే విధానానికి చాలామందికి నవ్వొస్తుంటుంది కూడా. మా నాన్నగారు దగ్గర నుండి మొదలు పెట్టి ఎక్కడెక్కడి విషయాలనూ బాలయ్య ఏకరువు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. 

Advertisement
CJ Advs

అయితే రీసెంట్ గా హిందూపూర్ తెలుగు దేశం అభ్యర్థుల తరుపున ప్రచారానికి వెళ్లిన బాలకృష్ణ..ప్రచార సందర్భంలో మాట్లాడిన మాటలకూ సొంత పార్టీ నేతలు నవ్వడాన్ని చూసి బాలయ్యకి ఎక్కడలేని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయన టిడిపి ప్రచారంలో భాగంగా ఈ కాలంలో అంటూ మొదలు పెట్టి యూత్ రాత్రి అయితే బండ్లేసుకుని పైకి చూస్తూ.. చుక్కలు లెక్కబెడుతూ.. వీళ్లలా పోవడం.. ఏదో ఢీ కొట్టడం.. అంటూ సీరియస్ గా మాట్లాడుతుంటే.. వెనకనే ఉన్న టిడిపి కార్యకర్తలు పుసుక్కున నవ్వేశారు. దానితో నవ్వకండి అంటూ బాలకృష్ణ సీరియస్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలయ్య నవ్వకండి సీరియస్ మేటర్.. నాకు తెలుసు చాలా మంది అలా తయారవుతున్నారు. మనుషులు అంతే.. సో జాగ్రత్తగా ఉండండి.. అంటూ వేలు చూపిస్తూ సొంతపార్టీ నేతలకు వార్నింగ్ ఇవ్వడాన్ని చాలామంది కామెడీ చేస్తున్నారు.

Balayya fires on Local TDP Leaders in Hindupur:

Balayya fires on Local TDP Leaders in Hindupur
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs